వరుసకు చిన్నాన్నతో అక్రమ సంబంధం: ఆ ఇద్దరు ఆత్మహత్య
కడప: వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు బలవన్మరణం పాలయ్యారు. వివాహేతర సంబంధం కారణంగానే వారిద్దరు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. వ్యవహారం పోలీసు స్టేషన్‌కు వెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నారు.
లక్ష్మిదేవి అనే మహిళ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరికీ వివాహాలు అయి పిల్లలు కూడా ఉన్నారు.

భర్త గల్ఫ్‌కు వెళ్లాడు
నారాయణ నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి (30)కి 13 ఏళ్ల క్రితం కొత్తసింగనమల గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తితో పెళ్లయింది. వాికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. బతుకుదెరువు కోసం నర్సింహులు గల్ఫ్ వెళ్లాడు.

అతనితో అక్రమ సంబంధం
ఈ క్రమంలో లక్ష్మీదేవ వరుసకు చిన్నాన్న అయిన కడప శ్రీనివాసులుత (41)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కడప శ్రీనివాసులుకు కూడా పెళ్లయి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.

వారిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయి
నాలుగు రోజుల క్రితం వారిద్దరు ఇంటి నుంచి వెళ్లిపోయారు. లక్ష్మీదేవికి సంబంధించినవాళ్లు కేసు పెట్టడంతో ఆదివారం తిరిగి ఇంటికి వచ్ారు. అవమానం పాలు కావడంతో మనస్తాపానికి గురై ఇరువురు కూల్ డ్రింక్‌లో విషపు గుళికలు వేసుకుని తాగారు.

విషపు గుళికలు కలిపిన డ్రింక్ తాగడంతో...
అస్వస్థతకు గురైన వారిద్దరిని అస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే లక్ష్మీదేవి మరణించగా, ఆ తర్వాత కొద్ది సేపటికి నర్సింహులు మరణిచాడు. నారాయణ నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి తండ్రి సుబ్బనరసయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications