అక్రమ సంబంధంతో అన్నదమ్ముళ్ల హత్య: అన్నను ఎత్తుకెళ్లి వేటకొడవళ్లతో చంపి
కర్నూలు: కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అన్నదమ్ములు నాగేంద్ర (30), నరేష్ (23)లను దారుణంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో నరికి, అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించి దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి ఫారంలోని ఎల్లెల్సీ కాలువ దగ్గర సోమవారం వెలుగు చూసింది.
ఆదోని పట్టణంలోని విక్టోరియా పేటకు చెందిన రాజు, లక్ష్మీదేవిలకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు నాగేంద్ర పట్టణంలో వ్యాపారం చేస్తున్నాడు. రెండో కుమారుడు నాగరాజు బెంగళూరులో పని చేస్తున్నాడు. నరేష్ ఐటీఐ చదువుతున్నాడు. నాగేంద్ర రైస్ మిల్లులో పని చేస్తున్నాడు.
నాగేంద్ర గత నాలుగేళ్లుగా అదే కాలనీకి చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు. దీనిపై చాలాసార్లు పంచాయితీ జరిగింది. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు పక్కా పథక రచన చేశారు.

ఇలా చేశారు....
నాగేంద్ర, నరేష్ తమ పనులు పూర్తి చేసుకుని ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా వీరి దగ్గరికి వచ్చి ట్రాక్స్ వాహనం ఆగింది. అందులో నుంచి ఐదారుగురు వ్యక్తులు కిందకు దూకారు. నాగేంద్రను బలవంతంగా ట్రాక్స్‌లో ఎక్కించుకున్నారు. అడ్డుకోబోయిన నరేష్‌పై వేటకొడవళ్లు, రాడ్లతో దాడి చేసి క్షణంలో అక్కడి నుంచి పారిపోయారు.

నరేష్‌ను ఆస్పత్రిలో చేర్చి...
నరేష్‌ను కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదోని పోలీసులు వెంటనే దుండగల కోసం గాలింపు చేపట్టారు. అయినా ఫలితం కనిపించలేదు. దుండగులు సిరిగుప్ప, కోసిగి రహదా రుల నుంచి ఎమ్మిగనూరు సమీపంలోని బన వాసి దిగువ కాలువ దగ్గరకు నాగేంద్రను తీసుకుని వెళ్లారుర. అక్కడ అతి దారుణంగా వేటకొడవళ్లతో నరికి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఉదయం అటుగా వచ్చిన కొంతమంది ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇలా గుర్తించారు....
సీఐ ప్రసాద్, ఎస్‌ఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ, ఆదోని త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్ టౌన్ ఎస్‌ఐ మన్మథ విజయ్ మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాలిపోయిన శవం కుడి చేయికి ఉన్న కడియాన్ని చూసి నాగేంద్రగా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగానే నాగేంద్రను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

నరేష్‌ను ఇలా...
నాగేంద్రకు భార్య శిరీష, మూడేళ్ల కుమార్తె గౌతమి ఉన్నారు. ఇదిలావుంటే, ఆదివారం రాత్రి దుండగుల వేట కొడవళ్ల దాడికి గురైన నరేష్ మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలిస్తుండగా మరణించాడు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు చెప్పారు.

ఇలా పథకాన్ని అమలు చేశారు...
నాగేంద్రను ఎత్తుకుపోవడానికి ముందు సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగులు ఈరన్న, రవి, సత్యనారాయణ అని పోలీసులు గుర్తించారు. సాయంత్రం 7 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న ఓ టీ స్టాల్‌లో దాదాపు 10 మందికి పైగా ట్రాక్స్ లో వచ్చినట్లు తెలుస్తోంది. ఒక ఫోన్ రావడంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారని, రాత్రి 10.30 గంటల సమయంలో అదే ట్రాక్స్‌లో వచ్చి నాగేంద్రను కిడ్నాప్ చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీని బట్టి తెలుస్తోంది. కిడ్నాప్ చేసిన తర్వాత మేధర్‌గేరిపైన, కొత్త బ్రిడ్జి మీదుగా మాధవరం రోడ్డుకు వెళ్లారు. అక్కడి నుంచి పెద్దతుంబళం గ్రామం దగ్గర ఎల్లెల్సీ కెనాల్‌పై బనవాసి గ్రామ కెనాల్ వరకు వెళ్లినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications