వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Crime News: ఒకే మహిళతో ఇద్దరి వివాహేతర సంబంధం.. కట్ చేస్తే రెండు హత్యలు..

|
Google Oneindia TeluguNews

ఓ హత్య కేసు ఎన్నో మలుపులు తిరిగింది. చివరికి మరో హత్యకు దారి తీసింది. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్ర కూడా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరుకు చెందిన శ్రీనివాసరెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. కరోనా నుంచి అతను వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. జులై, 26న తెల్లవారుజామున శ్రీనివాసరెడ్డి చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెం సమీపంలో హత్య గురయ్యాడు. శ్రీనివాస్ రెడ్డికి ఆళ్లవారిపాలెంకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు.

వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం

శ్రీకాంత్ రెడ్డికి ఆళ్లవారిపాలెంకు చెందిన జ్యోతి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి జ్యోతిని బెదిరించి లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి శ్రీకాంత్‌రెడ్డిని ఆమె దూరం పెడుతూ వస్తోంది. శ్రీనివాస్ రెడ్డి జ్యోతితో సంబంధం కొనసాగిస్తున్న విషయం శ్రీకాంత్ రెడ్డికి తెలిసిపోయింది. దీంతో శ్రీనివాస్ రెడ్డి అంతమొందిచాలని నిర్ణయించుకున్నాడు.

జ్యోతితో ఫోన్ చేయించి

జ్యోతితో ఫోన్ చేయించి

జులై 25న రాత్రి జ్యోతితో శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేయించిన శ్రీకాంత్ రెడ్డి ఇంటికి రప్పించాడు. అక్కడికి చేరుకున్న శ్రీనివాస్ రెడ్డిని శ్రీకాంత్‌రెడ్డి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కాల్ డేటా ఆధారంగా శ్రీకాంత్ రెడ్డి, జ్యోతిని అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ రెడ్డి కుటుంబం ఆర్థికంగా బలంగా ఉండడంతో కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు.

రూ.22 లక్షలు

రూ.22 లక్షలు


ఈ క్రమంలో భద్రిరాజుపాలెం గ్రామానికి నరేంద్రరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి పరిచయమైయ్యాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని రూ. 1.5 కోట్లు ఖర్చు అవుతుందని శ్రీకాంత్ రెడ్డి తండ్రికి చెప్పాడు.
ఇందులో భాగంగా కేసును విచారిస్తున్న సీఐతో రూ.22 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. తనకు ఎంతో కొంత డబ్బు వస్తుందని ప్లాన్ వేశాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి ఈ విషయంలో ఎంటైర్ అయ్యాడు.

 రూ.20 లక్షలకే

రూ.20 లక్షలకే

తాను రూ.20 లక్షలకే రాజీ చేస్తానని చెప్పాడు. తనకు శ్రీనివాస రెడ్డి అడ్డు వస్తున్నాడని భావించి.. అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. సెప్టెంబరు 20వ తేదీ రాత్రి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి డీల్‌ మాట్లాడాలి రావాలంటూ నరేంద్ర రెడ్డి ఫోన్ చేశాడు. కారులో శ్రీనివాసరెడ్డిని గన్నవరం సమీపంలోని ఆత్కూరు శివారు బలిపర్రుకు తీసుకెళ్లి హత్య చేశాడు.

ఎస్పీ సీరియస్

ఎస్పీ సీరియస్


మృతదేహాన్ని గుంతలో పాతిపెట్టాడు. కేసు విచారించిన పోలీసులు నిందితుడు నరేంద్ర రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ కేసు కృష్ణా ఎస్పీ జాషువా దృష్టికి తీసుకెళ్లిం. ఆయన ఈ కేసును రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది.

English summary
An extramarital affair resulted in two murders. The incident took place in Krishna district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X