ఏపీ తీరానికి దూసుకొస్తోన్న సూపర్ సైక్లోన్: 140 కి. మీ వేగంతో ప్రచండగాలులు: బాపట్ల- విశాఖ మధ్య

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అనూహ్య వేగాన్ని పుంజుకొంది. తుఫాన్ గా బలపడుతోంది. ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. తీరానికి సమీపిస్తోన్న కొద్దీ ఇది సూపర్ సైక్లోన్ గా మారుతుందని, ఏపీపై విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 28వ తేదీ ఉదయానికి ఈ తుఫాన్.. బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసింది. తీరానికి సమీపించిన సమయంలో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది.

వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. బంగాళాఖాతంలో ఈ తీవ్ర వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది అండమాన్ కు ఉత్తర వాయువ్యం- 520, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయం- 730, కాకినాడ- 820, మచిలీపట్నం- 920 కిలోమీటర్లు, బాపట్లకు తూర్పు దిశగా 990 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేడు తుఫాన్ గా, 27 నాటికి తీవ్ర తుఫాన్ నుగా మారనుంది.

Extreme Severe Cyclonic Storm Expected to landfall near Coasts Between Bapatla and Visakhapatnam

28వ తేదీ నాటికి ఏపీ, యానాం తీరప్రాంతాలకు చేరుకోనుంది. బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే సమయంలో గాలుల వేగం నిరంతరం 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గరిష్టంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీ తీరం వైపు తరుముకొస్తోన్న సూపర్ సైక్లోన్- మహోగ్రం- అక్కడ స్కూళ్లకు సైతం సెలవులు
ఏపీ తీరం వైపు తరుముకొస్తోన్న సూపర్ సైక్లోన్- మహోగ్రం- అక్కడ స్కూళ్లకు సైతం సెలవులు

సూపర్ సైక్లోన్ ముప్పు దృష్ట్యా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో స్థానిక ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగాలు ఏర్పాట్లు చేశాయి.

సముద్రం తీవ్రస్థాయిలో అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని వాతావరణ కేంద్రం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే సమీప తీరానికి తిరిగిరావాలని కోరింది. తీరప్రాంతాల్లో రవాణా, విద్యుత్, మౌలిక వసతుల సరఫరాకు ఆటంకం కలగకుండా అత్యవసర మరమ్మతు బృందాలను సిద్ధం చేశారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తీరప్రాంత జిల్లాల్లో మోహరించారు. కోస్తా జిల్లాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+