బాబుకు పక్కలో బల్లెంలా!: ఏరి కోరి ఇచ్చినందుకు ధిక్కారం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రభుత్వం ఏరి కోరి మరీ నియమించుకున్న వ్యక్తి.. తమవైపే అస్త్రాలు ఎక్కుపెడుతుండటంతో ఏపీ అధికార పార్టీలో కలవరం మొదలైంది. బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ ఐవైఆర్‌ కృష్ణారావు తీరుపై గుర్రుగా ఉన్న టీడీపీ అధిష్టానం ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది. రిటైర్ట్ అయిన తర్వాత కూడా ఆయన్ను పిలిచి మరీ.. కేబినెట్ హోదాతో గౌరవిస్తే.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ అధిష్టానం భావించింది.

సోషల్ మీడియాలో టీడీపీ మద్దతుదారులు ఐవైఆర్‌ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మనసుకు నచ్చని కాపురం ఎన్నాళ్లని చేస్తారు? దయచేసి మీ పదవికి రాజీనామా చేసి, ఇన్నాళ్లు ఈ కాపురం చేసినందుకు భాధపడుతున్నాం అని చెప్పి, తప్పులు నిరూపించండంటూ సవాల్ విసురుతున్నారు. దీంతో ఐవైఆర్‌ కు సైతం దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నాం దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్దమవుతున్నారు. ఇంతకీ టీడీపీకి అంతలా మింగుడుపడని పని ఆయనేం చేశారంటే!..

ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు:

ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు:

ఇటీవల పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను అరెస్టు చేయడం పట్ల ఐవైఆర్‌ కృష్ణారావు తన ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేసే కామెంట్స్‌ను ప్రభుత్వం ఇంత సీరియస్‌గా తీసుకోకుండా ఉండాల్సిందనేలా ఆయన కామెంట్స్ ఉన్నాయి. దీంతో టీడీపీ మద్దతుదారులు ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మోడీ-జగన్ భేటీపై ఇలా:

మోడీ-జగన్ భేటీపై ఇలా:

ప్రధాని మోడీతో ప్రతిపక్ష అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీని టీడీపీ నేతలు తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంలోను ఐవైఆర్ జగన్ తరుపున నిలిచి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చాటుకున్నారన్న విమర్శలున్నాయి. ఇందుకు ఆయన ఫేస్ బుక్‌లో పోస్టులే నిదర్శనమని టీడీపీ మద్దతుదారులు చెబుతున్నారు.

టీడీపీ వాళ్లు జగన్‌ను మోడీ ఎలా కలుస్తాడంటూ పరోక్షంగా మోడీని తిడుతుంటే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాసరావు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.. వీళ్లంతా ఎందుకు స్పందించడం లేదన్న పోస్టును ఐవైఆర్ షేర్ చేశారు.

రాష్ట్రానికి పాచిపోయిన లడ్డూలు ఇస్తారా? అంటూ పవన్ విమర్శిస్తే.. రాష్ట్ర బీజేపీ అంతా పవన్ మీద విరుచుకుపడింది. మరి వెంకయ్య పాటి విలువ లేదా మోడీకి అంటూ ఈ పోస్టులో చురకలంటించారు. ఒకవిధంగా బీజేపీని వెంకయ్యనాయుడు 'బాబు జేబు పార్టీ'గా మార్చేశాడని అందులో పేర్కొన్నారు. ఈ పోస్టును ఐవైఆర్ షేర్ చేయడంతో.. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మద్దతుదారులు భావిస్తున్నారు.

కులపిచ్చి నేత చంద్రబాబు:

కులపిచ్చి నేత చంద్రబాబు:

చంద్రబాబు కులపిచ్చిని బయటపెట్టిన విదేశీ విద్యార్థిని అన్న మరో పోస్టును సైతం ఐవైఆర్ షేర్ చేశారు. దాంతో పాటు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు టాక్స్ మినహాయింపు ఇవ్వడం పట్ల కూడా ఐవైఆర్ అభ్యంతరం వ్యక్తం చేయడం టీడీపీకి ఆగ్రహం తెప్పించేదిగా మారింది. ఏ ప్రాతిపదికన ఈ సినిమాకు టాక్స్ మినహాయింపునిచ్చారని ఆయన ప్రశ్నించారు.

ఎవరైనా చరిత్రకారులు ఈ సినిమా చూసి.. చారిత్రకంగా ఇది సరైన సినిమాయే అని నిర్దారించారా? లేదు కదా.. మరలాంటప్పుడు ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఎలా ఇస్తారని నిలదీశారు. చరిత్రను వక్రీకరించినందుకు సినీ నిర్మాతలకు కోర్టు పెనాల్టీ విధించిందని, మరోవైపు ప్రభుత్వం మాత్రం సినిమాకు రివార్డులు ఇచ్చిందని, ఇలా చేయడం ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రభుత్వానికి అస్త్రాలు ఎక్కుపెట్టారు.

ఎన్టీఆర్‌పై కార్టూన్:

ఎన్టీఆర్‌పై కార్టూన్:

పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌ను ప్రభుత్వం అరెస్టు చేయించిన నేపథ్యంలో.. గతంలో చంద్రబాబు అండతో ఎన్టీఆర్ ను కించపరిచేలా వేసిన కార్టూన్స్ మరోసారి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్టీఆర్ ను కించపరిచేలా ఈనాడు వేసిన కార్టూన్స్ ను ఐవైఆర్ షేర్ చేశారు. ఈ పోస్టులోను చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఉండటంతో.. మొత్తంగా ఆయన అధికార పార్టీకే పక్కలో బల్లెంలా మారుతున్నారని టీడీపీ మద్దతుదారులు అనుమానిస్తున్నారు.

ఒకవిధంగా ప్రత్యర్థి పార్టీ వైసీపీకి ఐవైఆర్ ఫ్రీలాన్సర్‌గా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది టీడీపీ అభిమానులు తీవ్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు ముందుకు వస్తున్నట్లు ఐవైఆర్ ప్రకటించడంతో.. వీటిపై ఆయన ఏ వివరణ ఇచ్చుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది.

రాజీనామా డిమాండ్ తో వేటు తప్పలేదు..

రాజీనామా డిమాండ్ తో వేటు తప్పలేదు..

ఐవైఆర్ వ్యవహారంపై టీడీపీ అభిమానులు, మద్దతుదారులు ఫేస్ బుక్ లో ఆయనపై యుద్దమే చేశారు. ఆయన రాజీనామాకు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లడంలో వారు సఫలమయ్యారు. దీంతో ఐవైఆర్ వైఖరిని తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు సర్కార్ ఆయనపై వేటు వేసింది. మరోవైపు ఐవైఆర్ మాత్రం భావ ప్రకటనా స్వేచ్చ కూడా లేక���ోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నాం 3గం.కు ఆయన మీడియా ముందు ఇవ్వనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Andhra Pradesh Chief Secretary I.Y.R. Krishna Rao and the present Chairman of Brahmin Welfare Corporation has made the news for a wrong reason.
Please Wait while comments are loading...