ఫేస్‌బుక్‌లో బిల్డర్.. తీరా వెళ్లి చూస్తే..! ప్రేమికుడి మోసం తట్టుకోలేక యువతి ఆత్మహత్య
వారిద్దరి మధ్య మొదలైన ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. అయితే, మాయమాటలు చెప్పిన ప్రియుడు తనను మోసం చేశాడనే విషయాన్ని తెలుసుకున్న ఆ యువతి జీర్ణించుకోలేకపోయింది.
విశాఖపట్నం: వారిద్దరి మధ్య మొదలైన ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారింది. అయితే, మాయమాటలు చెప్పిన ప్రియుడు తనను మోసం చేశాడనే విషయాన్ని తెలుసుకున్న ఆ యువతి జీర్ణించుకోలేకపోయింది. చివరకు తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తగరపువలస దరి రాజావీధికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడి కుమార్తె ప్రవల్లిక(21) దాకమర్రి దరి రఘు ఇంజినీరింగ్ కళాశాలలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతోంది. కాగా, గోపాలపట్నం శివారు ఎస్వీబీసీ కాలనీకి చెందిన నక్కా రాజేష్(25)తో ఫేస్‌బుక్ ద్వారా 5నెలల క్రితం ఆమెకు పరిచయం ఏర్పడింది.

అయితే, ఫేస్‌బుక్ ఖాతాలో రాజేష్ తనను తాను బిల్డర్‌గా పరిచయం చేసుకున్నాడు. కాగా, రెండు నెలల క్రితం ఎస్వీబీసీ కాలనీకి వచ్చిన ఆమె.. రాజేష్ పెయింటర్‌గా పనిచేస్తున్నాడని తెలుసుకుని నివ్వెరపోయింది. తనను మోసం చేశాంటూ రాజేష్‌ని నిలదీసింది. దీంతో అతని బంధువులు ప్రవల్లికకు ఏదో సర్దిచెప్పి అక్కడ్నుంచి పంపించివేశారు.
కాగా, ఇటీవల రాజేష్ పెళ్లికి సిద్ధమవుతున్న విషయాన్ని తెలుసుకున్న ప్రవల్లిక ఆదివారం సాయంత్రం గ్రామానికి చేరుకుంది. స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన యువతి తనతోపాటు కిరోసిన్ తెచ్చుకుంది. కాలనీలోని సామాజిక భవనం వద్దకు చేరుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
సమాచారం అందుకున్న రాజేష్.. ఘటనా స్థలానికి చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ప్రవల్లికను స్థానికుల సాయంతో కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ ప్రవల్లిక మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications