అవాస్తవ కథనాలు ప్రచురించే పత్రికలకు ఏపీ ప్రభుత్వం వార్నింగ్..!
రాష్ట్ర సచివాలయంను ప్రైవేట్ బ్యాంకుకు తాకట్టు పెట్టి రుణం పొందారంటూ పలు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్త అవాస్తవమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రచురితమైన కథనం పూర్తిగా సత్యదూరం. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ నుంచి ఈవిషయమై ఏపీ సీఆర్డీఏకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించటం జరిగిందని ప్రభుత్వం విడుదల చేసిన నోట్ స్పష్టం చేస్తోంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదు భవనాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టుపెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెడ్ డీఎఫ్సీ బ్యాంకుల నుండి ఏపీ సీఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొందలేదని సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నివేదించటం జరిగింది.
రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవోఎంఎస్ నెంబరు: 332, తేదీ: 15.10.2018 ప్రకారం 2,060 కోట్ల రూపాయల రుణాన్ని కన్సార్టియం బ్యాంకులు అయినటువంటి (యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు) మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీఏకు రిలీజ్ చేయటం జరిగిందని ప్రభుత్వం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.

2017వ సంవత్సరంలో హడ్కో రూ.1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరు చేసింది. అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లెటర్ జారీ చేయటం జరిగింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణమూ పొందలేదని స్పష్టం చేసిన ప్రభుత్వం,ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించటంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం జరుగుతుంది హెచ్చరించింది.
ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్‌లో ఇదే విషయమై ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. సెక్రటేరియట్‌ను తాకట్టు పెట్టి రుణం తీసుకోవడమనేది ఎక్కడా వినలేదని జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. గౌరవప్రదమైన హోదాలో ఉండి ప్రజలకు అవాస్తవాలు చేరవేయడం సరికాదని ప్రభుత్వం మండిపడింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications