fact check : జూన్ 30 వరకూ తిరుమల దర్శనం రద్దు ?
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను పాలమండలి ఆమోదంతో ప్రభుత్వం జూన్ 30 వరకూ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో నెలకొన్న పరిస్దితులను, కేసులను గమనిస్తే ఈ నిర్ణయం నిజమనే అంతా భావిస్తున్నారు. అయితే టీటీడీ బోర్డు దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో జూన్ 30 వరకూ శ్రీవారి దర్శనాలు రద్దయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని టీడీపీ పాలక మండలి ప్రకటించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని టీటీడీ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం లేదా టీడీపీ అధికారిక వెబ్ సైట్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని భక్తులకు సూచించింది. అనవసరంగా ఇలాంటి ప్రకటనలు నమ్మి భక్తులెవరూ తిరుమలకు వచ్చేందుకు బయటికి రావొద్దని కోరింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మే 3 వరకూ తిరుమలలో ఎలాంటి దర్శనాలకు అనుమతి లేదు. అయితే స్వామి వారికి నిత్య కైంకర్యాలతో పాటు అన్ని పూజలను యథావిథిగా నిర్వహిస్తున్నారు. భక్తులకు దర్శనం కోసం ఎప్పటి నుంచి అనుమతి ఇచ్చేదీ త్వరలోనే ప్రకటిస్తామని టీటీడీ తెలిపింది.












Click it and Unblock the Notifications