విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దొంగ నోట్ల ముఠాలో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: దొంగ నోట్లను చలామణి చేస్తున్న రెండు ముఠాలకు చెందిన ఎనిమిది మందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను నగర పోలీసు కమిషనర్ బి. శివధర్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.

తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అనకాపల్లి గవరపాలెంకు చెందిన భూపతి తేజ కూడా అరెస్టయినవారిలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌లో తయారైన భారత కరెన్సీని, భారత్ సరిహద్దులోని ముల్లా నుంచి ఒరిజినల్ కరెన్సీ మార్పుతో రూ. 35 వేలకు లక్ష రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను తీసుకుని వస్తుంటాడు.

నగరానికి తెచ్చిన నకిలీ కరెన్సీని అతను రామా టాకీస్ వద్ద పాప్‌కార్న్ వ్యాపారం చేస్తున్న దశమంతుల కిరమఅ కుమార్, నాతయ్యపాలెంకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చితంలపూడి సత్యప్రసాద్ అలియాస్ తేజ, పోతిన మల్లయ్య పాలెం, ఆర్‌హెచ్ కాలనీకి చెందిన పాకలపాటి వినయ్ వర్మ, షేక్ దిల్షాద్ అహ్మద్ సహకారంతో చెలామణి చేస్తుంటాడు.

బుధవారం ఉదయం పీఎం పాలెం క్రికెట్ స్టేడియం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.2,31,900 విలువ చేసే నకిలీ వంద నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

గాజువాక పెంటగంట్యాడుకు చెందిన నమ్మి శ్రీనివాసరావు, కొత్త గాజువాకకు చెందిన మహ్మద్ యాసిన్ సెంట్రల్ జైలులో వేర్వేరు శిక్ష అనుభవిస్తున్నారు. వారికి జైలులోనే పరిచయమైంది. బంగ్లాదేశ్ నుంచి నకిలీ కరెన్సీని తెచ్చి చలామణి చేసిన కేసులో శిక్ష అనుభవిస్తున్న అలీ అనే వ్యక్తి అక్కడే వారికి పరిచయమయ్యాడు. అతని ద్వారా నకిలీ కరెన్సీ మారకం, ఇతర వివరాలను తెలుసుకున్నారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత బంగ్లాదేశ్ మాల్దాకు వెళ్లి నకిలీ కరెన్సీ తీసుకుని వచ్చి గవర కంచరపాలెంకు చెదిన తాడివాడ సత్యనారాయణతో కలిసి నగరంలో చలామణి చేస్తున్నారు. బుధవారంనాడు మధురవాడ మార్కెట్‌లో నకిలీ కరెన్సీ మారుస్తుండగా పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు వెల్లడిస్తున్న శివధర్ రెడ్డి

వివరాలు వెల్లడిస్తున్న శివధర్ రెడ్డి

రెండు నకిలీ కరెన్సీ ముఠాలకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటనలకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడిస్తున్న విశాఖ నగరం పోలీసు కమిషనర్ శివధర్ రెడ్డి.

పోల్చి చూస్తున్న పోలీసులు..

పోల్చి చూస్తున్న పోలీసులు..

అసలు నోటుతో నకీలి నోటును పోల్చి చూస్తున్న పోలీసులు. అరెస్టయినవారిలో తెలుగు సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గహా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నాడు.

నకిలీనోట్లు ఇలా...

నకిలీనోట్లు ఇలా...

పోలీసులు రెండు ముఠాలకు చెందిన ఎనిమిది మంది నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లు ఇలా ఉన్నాయి.

నకిలీ నోట్ల ముఠా సభ్యులు..

నకిలీ నోట్ల ముఠా సభ్యులు..

నకిలీ నోట్లను బంగ్లాదేశ్ నుంచి తీసుకుని వచ్చి చెలామణి చేస్తూ పట్టుబడిన రెండు ముఠాల సభ్యులు వీరే..

అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..

అసిస్టెంట్ డైరెక్టర్ కూడా..

నకిలీ నోట్లను చెలామణి చేస్తూ పట్టుబడినవారిలో చలనచిత్ర రంగంలో సహాయ దర్శకుడిగా పనిచేస్తున్న భూపతి తేజ ఉన్నాడు.

వివరాలు చెప్పిన శివధర్ రెడ్డి

వివరాలు చెప్పిన శివధర్ రెడ్డి

నకిలీ కరెన్సీ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీ నోట్లను మీడియా సమావేశంలో నగర పోలీసు కమిషనర్ శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

పిఎ పాలెం

English summary
Fake currnency notes gangs have been nabbed by Visakhapatnam police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X