భార్గవ్ రామ్, ఆయన తమ్ముడిపై పెట్టినవి తప్పుడు కేసులు, వారిపై కోర్టుకెళ్తా : భూమా అఖిల ప్రియ
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, ఆయన తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి లపై బోయినపల్లి పోలీసులు కరోనా ఫేక్ సర్టిఫికెట్ కోర్టుకు సమర్పించారు అంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బోయినపల్లి ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త తో పాటుగా 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కోర్టు విచారణ నుండి తప్పించుకోవడానికి వారిరువురు నకిలీ కోవిడ్ సర్టిఫికెట్లు కోర్టుకు సమర్పించినట్లు గుర్తించిన పోలీసులు వారి పై మరో కేసు నమోదు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన ఆసుపత్రి సిబ్బందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తప్పుడు కేసులు పెట్టారన్న భూమా అఖిల ప్రియ
అయితే తన భర్త భార్గవ్ రామ్ పై, అలాగే ఆయన తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి లపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని భూమా అఖిలప్రియ ఆరోపిస్తున్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకొని తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సరికాదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. కావాలని తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆమె తెలిపారు. ఇటీవల తన భర్త భార్గవ్ రామ్, ఆయన సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిలపై బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేయడంపై స్పందించిన భూమా అఖిలప్రియ కర్నూలులో విలేకరులతో మాట్లాడారు.

ల్యాబ్ సిబ్బంది తప్పుడు రిపోర్ట్ ఇచ్చారన్న అఖిల ..
కొద్ది రోజుల క్రితం తన భర్త, ఆయన తమ్ముడు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చిన తర్వాత కరోనా పరీక్ష చేయించుకున్నారు అని ఆమె వెల్లడించారు. అయితే తన భర్తకు పాజిటివ్ రిపోర్ట్ పంపించిన ల్యాబ్ సిబ్బంది, పోలీసులకు మాత్రం నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని వెల్లడించారు. తన భర్త తనకు పాజిటివ్ ఉందని ల్యాబ్ సిబ్బంది పంపించిన రిపోర్టును పంపించగా తప్పుడు సర్టిఫికెట్ తో మోసం చేశారంటూ పోలీసులు తన భర్తపై కేసు నమోదు చేశారని భూమా అఖిలప్రియ వెల్లడించారు.

ల్యాబ్ పై కేసు వేస్తామని భూమా అఖిల ప్రియ వెల్లడి
ల్యాబ్ సిబ్బందిపై తాము కోర్టులో కేసు వేస్తామని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ల్యాబ్ సిబ్బంది తప్పుడు రిపోర్ట్ పోలీసులకు ఇవ్వటం వెనుక ఎవరో ఉన్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు .ఇక కిడ్నాప్ ఘటనలో తన భర్త ప్రమేయం ఉంటే మళ్ళీ ఐడెంటిఫికేషన్ కోసం ఎందుకు రమ్మంటున్నారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు తమని హింసిస్తున్నారని వెల్లడించిన అఖిలప్రియ, తెలంగాణ సీఎం కేసీఆర్ కు , మంత్రి కేటీఆర్ కు తాను పోలీసులు హింసపై లేఖలు రాస్తానని వెల్లడించారు. ప్రాణం పోయినా తమ ఆస్తులను వదులుకోబోమని తేల్చిచెప్పారు భూమా అఖిలప్రియ. ఇదే సమయంలో తమ పై పెట్టిన కేసును సీబీఐకి అప్పగించాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు.
Recommended Video

కోర్టు విచారణ తప్పించుకునేందుకు తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారని కేసులు పెట్టిన పోలీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్, జగత్ విఖ్యాత్ రెడ్డిలు ఈ నెల 3వ తేదీన కోర్టులో హాజరు కావాల్సి ఉండగా, కోర్టుకు హాజరు కాకుండా ఉండడానికి వారు కరోనా బారిన పడ్డట్టుగా ఈ నెల 1వ తేదీన సర్టిఫికెట్లు సమర్పించారు. కరోనా కారణంగా కోర్టుకు హాజరు కాలేదని వారిరువురు అందులో పేర్కొన్నారు. అయితే ఆ రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ అని తేల్చిన పోలీసులు భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ పై , అలాగే ఆయన సోదరులు జగద్విఖ్యాత్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications