ఆ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోము .. ప్రత్యర్ధి పార్టీలకు వార్నింగ్ ఇచ్చిన పురంధరేశ్వరి
బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఏపీ సీఎం వైయస్ జగన్ గురించి, అలాగే మాజీ సీఎం చంద్రబాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్ధులపై ఆమె నిప్పులు చెరిగారు. బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. నిధుల కేటాయింపు వివరాలు చెప్పకుండా కేంద్రం నిధులివ్వడం లేదంటూ నిరాధార ఆరోపణలతో చాలా మంది నాయకులు మీడియాలో మాట్లాడుతున్నారని పేర్కొన్న పురంధరేశ్వరి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యలేని అసమర్ధ ప్రభుత్వం
నెల్లూరులో మంగళవారం పర్యటించిన పురంధరేశ్వరి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సిన నిధులు ఇస్తుందని ,గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో అనేక పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్న పురంధరేశ్వరి ప్రభుత్వ అసమర్ధతను పక్కన పెట్టి కేంద్రంపై నిందలు వేస్తుందని మండిపడ్డారు . సీఎం జగన్ ఏపీలో అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని పేర్కొన్నారు పురంధరేశ్వరి.

సీఎం జగన్ నిర్ణయాల వల్లే ఏపీకి ఈ దుస్థితి
ఏపీలో టీడీపీ, వైసీపీలు స్వలాభం కోసమే పని చేస్తున్నాయని, రెండు పార్టీల విధానాలను ప్రజలు ఇష్టపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ఇక ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లనే పోలవరం పనులు సక్రమంగా సాగడం లేదని ఆమె ఆరోపించారు. ఇక జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఏపీకి నష్టం కలిగిందని చెప్తున్నారు పురందేశ్వరి.
Recommended Video


టీడీపీ, వైసీపీలపై నిప్పులు చెరిగిన చిన్నమ్మ
ఏపీలో టీడీపీ ,వైసీపీలు బీజేపీని దోషిని చెయ్యాలని చూస్తున్నాయని కానీ ఏపీ ప్రస్తుత పరిస్థితికి ఆ రెండు పార్టీలే కారణం అని పేర్కొన్నారు. సీఎం జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్మాణ రంగం కుదేలైందని, కూలీల జీవితాలు వీధినపడ్డాయని పురంధరేశ్వరి ఆరోపణలు గుప్పించారు . శాసనమండలి రద్దు చేయకూడదంటూ ఇపుడు నానా యాగీ చేస్తున్న చంద్రబాబు గతంలో రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు . భవిష్యత్ లో జనసేనతోనే కలిసి పనిచేస్తామని, టీడీపీ , వైసీపీ లపై నిప్పులు చెరిగారు పురంధరేశ్వరి .
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..!












Click it and Unblock the Notifications