విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్త్రీకి వేధింపులు: భర్త, మరిది, అత్త అరెస్టు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భార్యాపిల్లలను వేధిస్తున్న వ్యక్తిని, అతని తల్లిని, సోదరుడిని పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. మహిళా పోలీసు స్టేషన్ సిఐ నాగేంద్ర భూపాల్, బాధితురాలు సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

విశాఖకు చెందిన చిన్నారితో నర్సీపట్నానికి చెందిన రాజన వెంకప్రకాష్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. రూ. 6 లక్షల కట్నం, ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు. వీరికి శ్రావణ్ రాజు, అశ్విని అనే ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయినప్పటి నుంచే చిన్నారికి అత్తింటివారి వేధింపులు ప్రారంభమయ్యాయి.

భర్త, అత్త మేరీ, మామ రాజుబాబు, మరిది రమేష్, తోటి కోడలు లత కలిసి ఆమెను వేధిస్తూ వచ్చారు. తిరగబడితే అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తూ వచ్చారు. చిన్నపిల్లలను కొట్టేవారు. ఇంతటితో ఆగకుండా ఇటీవల వారిని కొట్టి బయటకు నెట్టివేశారు.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

తనను, తన పిల్లలను కొట్టి ఇంటి నెట్టేయడంతో బాధితురాలు చిన్నారి పోలీసులను ఆశ్రయించింది. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు నర్సీపట్నం వెళ్లారు. నిందితులు వారిపై తిరగబడ్డారు.

మహిళా పోలీసులకు ఫిర్యాదు

మహిళా పోలీసులకు ఫిర్యాదు

చిన్నారి బుధవారంనాడు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.

మామ పరారీ..

మామ పరారీ..

బిడ్డలతో మామ రాజుబాబు పరారయ్యాడు. బిడ్డలను తనకు అప్పగించాలని చిన్నారి కోరుతోంది.

వారికి ఇద్దరు పిల్లలు

వారికి ఇద్దరు పిల్లలు

చిన్నారి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. చిన్నారితో రాజన వెంకటప్రకాష్ వివాహం ఆరేళ్ల క్రితం జరిగింది.

English summary
Police arrested on complaint of woman her husband, brother -in -law and mother -in -law in Visakhapatnam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X