కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య: నలుగురు మృతి

వాళ్లంతా శనివారం సాయంత్రం మాచర్ల పట్టణానికి చేరుకున్నారు. వీరు నలుగురితో పాటు బస్టాండ్ సమీపంలో మరో యువకుడిని కూడా స్థానికులు చూశారు. బస్టాండ్‌లోని షాపుల్లో మహిళలు గ్లాసులు కొనుగోలు చేయగా, వెంకటేశ్వరరెడ్డి బీడీలు కొన్నట్లు స్థానికులు తెలిపారు. కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లే రైల్వేట్రాక్ సమీపంలోని ముళ్లపొదల్లో పురుగుమందు తాగి వీరు విగతజీవులై పడివుండటాన్ని ఆప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అర్బన్ సీఐ మురళీకృష్ణ నలుగురి మృతదేహాలను పరిశీలించారు. వారివద్ద వున్న సెల్‌ఫోన్ ఆధారంగా బంధువుల వివరాలు సేకరించారు. సెల్‌ఫోన్ కొల్లి లత కుమారుడు వినీల్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. సాయంత్రానికి వెంకటేశ్వరరెడ్డి కుమారుడు వీరారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తమవారు ఆత్మహత్యకు పాల్పడి వుంటారని భావిస్తున్నట్లు అతను తెలిపాడు.
లత భర్త శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ - తన భార్య అనారోగ్యంగా ఉండటంతో అసుపత్రికి వెళ్లేందుకు 10రోజుల క్రితం వల్లభాపురం వెళ్లిందని తెలిపాడు. మున్నంగిలో నివాసముండే సరోజని వీరివద్దకు ఎందుకు వచ్చిందీ తెలియలేదు. కృష్ణాడెల్టా ప్రాంతం నుండి వీరు జిల్లా మారుమూల ప్రాంతంలోని మాచర్లకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడాల్సిన కారణం ఏమిటనేది మృతుల బంధువులు సైతం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
వినీల్‌రెడ్డి రెండు నెలల క్రితమే ఉపాధి కోసం హైదరాబాదు వెళ్లాడని, అతను వస్తేకానీ వీరి మృతికి కారణం ఏమిటనేది వెల్లడవుతుందని వారు అంటున్నారు. మాచర్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications