వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత..!!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సినీ నటుడు.. కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున ఆయన తుది శ్వాస విడించారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు చిత్రసీమలో రెబెల్‌ స్టార్‌గా పేరొందిన కృష్ణంరాజు1940 జనవరి 20న ప.గో.జిల్లా మొగల్తూరులో జన్మించారు.

హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించిన కృష్ణంరాజుచదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేసారు. కొన్ని దశాబ్దాల కాలం ఆయన తెలుగు సినీ పరిశ్రమను ఏలారు. 183 సినిమాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక సినిమా ద్వారా చిత్ర రంగం ప్రవేశం చేశారు. 1991 లో కాంగ్రెస్ నుంచి నర్సాపురం లోక్ సభకు పోటీ చసారు. 1998లో బీజేపీలో చేరిన ఆయన 1999 ఎన్నికల్లో కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. వాజ‌్‌పేయి హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా పని చేసారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయారు.

Famous cine actor Krishnam Raju passed away at 83 in Hyderabad

కొద్ది కాలం క్రితం వరకు ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది. కొంత కాలంగా అస్వస్థతతో ఉన్న ఆయనను కొద్ది రోజుల క్రితమే ప్రభాస్ కూడా పరామర్శించార. రాధేశ్యామ్ ఆయన చివరి చిత్రం. తెలుగు సినిమా పరిశ్రమ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ కొనసాగారు. ఆయన మరణంతో ఒక్కసారిగా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఒక్కక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. రేపు (సోమవారం) కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

English summary
Famous senior cine hero and ex central minsiter Minister Krihsnam Raju deid at 83. He suffering with ill ness since one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X