ఫ్యాన్స్‌లో చీలిక: పవన్ కళ్యాణ్, చిరు మధ్య చిచ్చు?

తిరుపతి: మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ అభిమాన సంఘాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నాయి. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైదరాబాద్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్టు పవన్‌ కళ్యాణ్ అభిమాన సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్‌ తెలిపారు.

త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ అభిమానుల సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రస్థాయి పవన్‌ అభిమాన సంఘాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కిరణ్‌ తెలిపారు. ఈ నెల 30 తిరుపతిలో చిరంజీవి, పవన్‌ అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. 30న ఫ్యాన్స్‌డేగా జరపాలని నిర్ణయించామని చెప్పారు.

Fans of Chiranjeevi and Pawan Kalyan split

పవన్‌కల్యాణ్‌ రాజకీయ విధానాన్ని తాము వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు. అభిమాన సంఘం క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉంటుందని, కల్తీపై పోరాటం చేస్తామని స్వామినాయుడు తెలిపారు. అయితే, స్వామి నాయుడు ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావద్దని కిరణ్ పవన్ కళ్యాణ్ అభిమానులను కోరారు.

రాజకీయంగానే అన్నయ్య, తమ్ముడు అభిమానుల మధ్య చీలిక వచ్చినట్లు భావిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ బిజెపికి, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. చిరంజీవి ఇంకా కాంగ్రెసులోనే ఉన్నారు. కాంగ్రెసు పార్టీ కోసమే స్వామి నాయుడు సమావేశం ఏర్పాటు చేస్తున్నారని భావించడంతో కిరణ్ దానికి వ్యతిరేకంగా స్పందించినట్లు అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+