హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి సహకరిస్తాం: హైదరాబాదుకు ఏపీ మంత్రి అఖిలప్రియకు ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియను తెలంగాణ ఫ్యాప్సీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు ఆహ్వానించారు.

జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు: ఇందూ కేసు.. జగన్-విజయసాయిలకు సీబీఐ షాక్జగన్ కంపెనీల్లోకి రూ.70 కోట్లు: ఇందూ కేసు.. జగన్-విజయసాయిలకు సీబీఐ షాక్

ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న టూరిజం కాన్‌క్లేవ్ 2018కి అతిథిగా రావాలని వారు అఖిలప్రియకు ఆహ్వానపత్రం అందించారు.

 అఖిలప్రియను కలిసిన ఫ్యాప్సీ ప్రతినిధులు

అఖిలప్రియను కలిసిన ఫ్యాప్సీ ప్రతినిధులు

ఫ్యాప్సీ డైరెక్ర్ వైదేహీ, టూరిజం కాన్‌క్లేవ్ 2018 చైర్మన్ వాల్మికీ హరికృష్ణ నవ్యాంధ్ర రాజధాని అమరావతి సచివాలయంలో మంత్రి అఖిలప్రియను కలిశారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు.

 ఏపీ నుంచి అఖిలప్రియకు ఆహ్వానం

ఏపీ నుంచి అఖిలప్రియకు ఆహ్వానం

హైదరాబాదులోని మారియట్ హోటల్లో జూన్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టూరిజం కాన్‌క్లేవ్ - 2018 నిర్వహించనున్నారు. ఏపీ నుంచి అతిథిగా అఖిలప్రియను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ఏపీకి సహకరిస్తాం

ఏపీకి సహకరిస్తాం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పర్యాటక అభివృద్ధి పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వైదేహీ అన్నారు. వచ్చే సెప్టెంబర్ నెలలో ఏపీలో నిర్వహించే టూరిజం కాన్‌క్లేవ్ కార్యక్రమానికి సహకారం అందిస్తామన్నారు.

అఖిలప్రియ ఇలా

అఖిలప్రియ ఇలా

ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ... పర్యాటక అభివృద్ధికి ఇరు రాష్ట్రాల సమైక్య ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ టూరిజం కాన్‌క్లేవ్‌కు ఏపీ నుంచి ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని చెప్పారు.

English summary
FAPCCI invited Andhra Pradesh Minister Bhuma Akhila Priya for Telangana Tourism conclave 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X