బాబు మోసం, ఆశలు వదులుకోనివ్వం: జగన్ ట్వీట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు.
చంద్రబాబు బూటకపు వాగ్ధానాలతో రైతులు దారుణంగా మోసపోయారని అన్నారు. అలాంటి రైతులు ఆశలు వదులుకోకముందే వారి తరఫున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు.
రైతుతో తాను మాట్లాడుతున్న ఫోటోను వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Farmers like him-devastated by CBN's lies. We, all, have to fight for him now before he gives up hope! pic.twitter.com/oQnQQ9HFkB
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 27, 2015 కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ ఖాతా తెరిచిన జగన్ ఆ తర్వాత చంద్రబాబు పైన మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో నెలకొన్న క్షేత్రస్థాయి వాస్తవాలు హృదయాన్ని కదిలిస్తున్నాయని, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్దాలు.. రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాయని, ఇలాంటి సమయంలో ఆ వర్గాల గొంతుకగా నిలబడి, వారిలో ఆత్మ విశ్వాసం పెంచాల్సిన అవసరముందని గతంలో ట్విట్ చేశారు.












Click it and Unblock the Notifications