పవన్ కళ్యాణ్‌కు పాలాభిషేకం, రోజా హెచ్చరిక: బాలకృష్ణకు హామీ (పిక్చర్స్)
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోకు మంగళగిరి పట్టణంలో రైతులు, జనసేన పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం పాలాభిషేకం చేశారు. జనసేన కార్యకర్తలు రాజధాని భూసేకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గాలికి రోజా హెచ్చరిక
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తన తీరు మార్చుకోకపోతే తాట తీస్తానని ఎమ్మెల్యే రోజా గురువారం నాడు హెచ్చరికలు జారీ చేశారు.
అసెంబ్లీలో, బయట కూడా తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వం తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు.
బాలకృష్ణకు అచ్చెన్నాయుడు హామీ
అమరావతిలో విశ్వ క్రీడాగ్రామం నిర్మిస్తామని, హిందూపురం, గుంటూరు, విజయవాడల్లోని క్రీడా మైదానాలను పిపిపి పద్ధతిలో అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు హామీ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ - రోజా
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోకు మంగళగిరి పట్టణంలో రైతులు, జనసేన పార్టీ కార్యకర్తలు గురువారం ఉదయం పాలాభిషేకం చేశారు. మరోవైపు, నగరి ఘటన నేపథ్యంలో రోజా టిడిపి నేత గాలిని హెచ్చరించారు.

బాలకృష్ణ
బాలకృష్ణ బుధవారం హైదరాబాద్‌లో ఎపి సచివాలయానికి తొలిసారి వచ్చారు. హిందూపురం నియోజకవర్గంలోని పలు సమస్యలపై ఆయన కార్మిక మంత్రి అచ్చెన్నాయుడుతో సమావేశమై చర్చించారు.

బాలకృష్ణ
బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ హిందూపురం సహా అనంతపురం జిల్లా అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి హిందూపురానికి నీళ్లు వస్తాయని అన్నారు. సాంస్కృతిక, పర్యాటక, క్రీడారంగాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు.

బాలకృష్ణ
ప్రతిపక్షాల విమర్శలను తాను పట్టించుకోనని పేర్కొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, హిందూపురం స్టేడియంలను పిపిపి పద్ధతిలో నిర్మిస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. హిందూపురాన్ని క్రీడలకు ఆదర్శ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.












Click it and Unblock the Notifications