పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఇద్దరు కుమారులు మృతి
ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని రాజుపాలెం మండలం నెమలిపురి వద్ద ఈ ఘటన జరిగింది. కారును లారీ ఢీ కొట్టగా.. ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతులను ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ నజీమా, నూరుల్లా, హబీబుల్లాగా గుర్తించారు.
కాగా హైదరాబాద్ నుంచి కారులో స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమారులు మృతి చెందడంతో స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.













Click it and Unblock the Notifications