దారుణం : లాక్ డౌన్ వేళ బయట తిరగవద్దన్నందుకు.. కన్నతండ్రినే కడతేర్చిన కొడుకు..

లాక్ డౌన్ వేళ అనవసరంగా బైక్‌పై బయట తిరగవద్దన్నందుకు ఓ కొడుకు కన్నతండ్రినే హతమార్చాడు. ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తంగిరాలపల్లికి చెందిన లింగాల సుబ్బయ్య(58)కి మరియదాసు అనే కుమారుడు ఉన్నాడు. లాక్ డౌన్ నిబంధనలను కూడా పట్టించుకోకుండా మరియదాసు బైక్‌పై జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో సుబ్బయ్య తరుచూ మందలించేవాడు. అలా ఇద్దరి మధ్య గొడవలు కామన్‌గా మారిపోయాయి.

father killed by son for reprimanding him in prakasam district

Recommended Video

    ప్రకాశం జిల్లాకు AP రాజధాని || GVL Narasimha Rao Sensational Comments On AP Capital || Oneindia

    ఇదే క్రమంలో శనివారం బయట నుంచి వచ్చిన మరియదాసును సుబ్బయ్య మందలించాడు. తీవ్ర కోపోద్రిక్తుడైన మరియదాసు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. తండ్రిపై కక్ష పెంచుకున్నాడు. అదే రోజు రాత్రి సుబ్బయ్య మంచంపై నిద్రిస్తున్న సమయంలో.. రోకలి బండతో తలపై బలంగా దాడి చేసి హత్య చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు సుబ్బయ్యను మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్బయ్య మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+