తాగుబోతు కొడుకును చంపిన తండ్రి, కాల్చుకొని పోలీసు

Father kills son
వరంగల్/విజయవాడ: వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. తాగుబోతు కొడుకును ఓ తండ్రి రోకలితో కొట్టి చంపాడు. జిల్లాలోని చిన్నారావుపేటలో ఓ కొడుకు తాగుడుకు బానిసయ్యాడు. తండ్రి ఎన్నోసార్లు తాగుడు మానుకోవాలని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన తండ్రి రోకలి బండతో కొడుకు తలపై కొట్టాడు. దీంతో ఆ కొడుకు కన్నుమూశాడు.

కానిస్టేబుల్ ఆత్మహత్య

ఏటూరు నాగారం పోలీసు స్టేషన్ పరిధిలో పని చేస్తున్న సందీప్ అనే కానిస్టేబుల్ తనకు తాను తుపాకీతో కాల్చుకున్నాడు. ఇది గమనించిన సహచరులు అతనిని వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన పోలీసు ఖానాపురం మండలం మంగళవారిపేటకు చెందిన వ్యక్తి. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కృష్ణా జిల్లా కానూరు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విజయా చౌదరి తాను ఉంటున్న హాస్టల్ గదిలో సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విజయ స్వస్థలం జగ్గయ్యపేట. హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు.

ఆత్మహత్యాయత్నం

పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం మద్దూరు వంతెనపై నుంచి ఐదేళ్ల కుమారుడితో సహా ఓ మహిళ పశ్చిమ డెల్టా కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను రక్షించారు. కొడుకు గల్లంతయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+