వీడు తండ్రేనా: ఐదు నెలల పాటు కూతురిపై అత్యాచారం

రక్షించాల్సిన తండ్రే తన కూతురిపై ఐదు నెలలుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం: రక్షించాల్సిన తండ్రే కూతురి పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. ఐదు నెలల పాటు కూతురిపై వరుసగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. చివరకు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు గురువారం సాయంత్రం ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను అందించారు.

హార్బర్‌ సబ్‌ డివిజన్‌ ఏసీపీ కె.రంగరాజు అందించిన వివరాల ప్రకారం- నగరంలో కొత్త జాారిపేటకు చెందిన కదిరి ధనరాజ్ అనే వ్యక్తి( 42) తన భార్యాకూతుళ్లతో స్థానికంగా నివసిస్తున్నడాు. నిందితుడు గతంలో ఓ ప్రయివేటు సంస్థలో పనిచేసేవాడు. ఇటీవల విధులకు వెళ్లడం మానేసి ఖాళీగా ఉంటూ వ్యసనాలకు బానిసయ్యాడు.

Father rapes daughter for about 5 months

అతని భార్య సమీపంలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లిన సందర్భాల్లో ఒంటరిగా ఉంటున్న 14 ఏళ్ల కూతురిపై ఆ కామాంధుడి కళ్లు పడ్డాయి. అప్పటి నుంచి ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఈ విషయం ఇటీవల బాలిక తల్లికి తెలియడంతో భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది.

తల్లి బాలికను ప్రశ్నించగా గత ఐదు నెలలుగా తండ్రి ఇలాగే చేస్తున్నాడని చెప్పింది. దీంతో తన బిడ్డతో పాటు ఆ తల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. బాలికకు కేజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేయగా అత్యాచారం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

బయటకు చెప్తే చంపేస్తానని కదిరి ధనరాజ్ కూతురిని బెదిరిస్తూ వస్తున్నాడు. భర్త ఘాతుకం బయటపడడంతో భార్య 15 రోజుల క్రితం కూతురితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+