కన్న కూతురిపై తండ్రి అత్యాచారం: కిడ్నాపైన బాలుడు క్షేమం
ఏలూరు/ గుంటూరు: క్షణక్షణం భద్రతగా ఉండాల్సిన తండ్రే తన కూతురి పట్ల అఘాయిత్యం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. 17 ఏళ్ల తన కూతిరిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఏలూరు త్రిటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. భీమడోలు మండలంలో చేపలు పట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న నిందుతుడికి మూడు సంవత్సరాల క్రితమే భార్య చనిపోయింది.
దీంతో ఇద్దరి కుమారులను సమీపంలోని ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించి కుమార్తేతో పాటు చేపలు పట్టుకుని వచ్చిన ఆదాయంతో ఇరువురు జీవిస్తున్నారు. ప్రతి రోజూ తన తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఏలూరు త్రిటౌన్ పోలీసులకు ఈ బాలిక ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్భయ కేసుగా నమోదు చేశామని తెలిపారు.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలోని పొన్నూరులో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. పొన్నూరుకు చెందిన తాపీమేస్ర్తీ ఇబ్రహీం కుమారుడు కరీముల్లాను ఏసుపాదం అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. రూ.10 లక్షలు ఇస్తేనే బాలుడిని అప్పగిస్తామని బెదిరించడంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ ప్రకాశం జిల్లా నాగుల ఉప్పలపాడులో ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ లోగానే పోలీసులు పట్టుకుంటారేమో అన్న భయంతో ఏసుపాదం బాలుడిని రాజుపాలెం బస్టాండ్ వద్ద వదిలివెళ్లాడు. పోలీసులు కిడ్నాపర్ ఏసుపాదం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏసుపాదం గతంలో కరీముల్లా అనే వ్యక్తి వద్ద పనిచేశాడు.












Click it and Unblock the Notifications