తండ్రి ఎలా ఉండాలంటే?: బాబుపై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

అమరావతి: ఫాదర్స్ డేను పురస్కరించికుని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన తండ్రి, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని చూసినప్పుడల్లా ఒక తండ్రిగా తానేలా నడుచుకోవాలో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

ఒక నాయకుడిగానే కాదు, ఎంతో మందికి తండ్రి ప్రేమను పంచుతున్నారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఫాదర్స్ డే సందర్భంగా లోకేష్ తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

తన తండ్రి చంద్రబాబునాయుడుతో కలిసి ఉన్న ఫొటోలు ఈ సందర్భంగా పోస్టు చేశారు. జీవితం అనే పాఠశాలలో తండ్రే మొదటి గురవు అని చెప్పారు.

తండ్రి ఆదర్శనీయంగా ఉన్నప్పుడే ఆ పిల్లలు సమాజానికి వన్నె తెచ్చే పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. రేపటి సమాజ నిర్మాణంలో పునాదిరాళ్లుగా నిలుస్తున్న తల్లిదండ్రులందిరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని లోకేష్ తన ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh minister Nara lokesh wished his father, and AP CM Chandrabab Naidu on Father's day.
Please Wait while comments are loading...