విజయవాడ దుర్గ గుడిలో అపచారం.. అమ్మవారి నిజరూపం సోషల్ మీడియాలో ప్రత్యక్షం
విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. అమ్మవారి నిజస్వరూప దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఓ మహిళా భక్తులు ఆలయ సిబ్బంది కళ్లు కప్పి, ఆలయం లోపలకి సెల్ ఫోన్ తీసుకువెళ్లారు. ఆ మహిళా భక్తురాలు ఆలయానికి సంబంధించిన వాటిన్నింటిని తన కెమెరాలో చిత్రికరించారు.ఆలయం వెలుపల, లోపల వీడియోలను సైతం రికార్డు చేశారు. ఆలయం అంతరాలయంలోని అమ్మవారి నిజరూపాన్ని సైతం తన కెమెరాలో రికార్డు చేసింది ఆ మహిళా భక్తురాలు.
ఈ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మవారి ఆలయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆలయం అధికారుల నిర్లక్ష్యం ఈ ఘటనతో మరోసారి బయటపడింది. ఆలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని చెప్పుకునే అధికారుల మాటలు వట్టివేనని ఈ ఘటనతో తేలిపోయింది. గతంలో కూడా ఆలయ సిబ్బంది పలుమార్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అమ్మవారి నిజరూపాన్ని సైతం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో భక్తులు మండిపడుతున్నారు.

దుర్గమ్మ ఆలయంలో సెల్ ఫోన్ నిషేధమనే నిబంధన ఉన్నా అమ్మవారి నిజస్వరూపం దృశ్యాలు బయటకు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమ మనోభావాలు దెబ్బ తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో నిర్లక్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న దుర్గ గుడి బోర్డు ఛైర్మన్ సంబంధిత అధికారులపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అమ్మవారి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళా భక్తురాలపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications