సచిన్ దత్తత గ్రామంలో విష జ్వరాలు, ప్రజలు తీవ్ర అవస్థలు

అమరావతి: బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం విష జ్వారాలతో అల్లలాడుతుంది. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు సచిన్ టెండూల్కర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే, ఇప్పుడు ఆ ఊళ్లో అంతా విషజ్వరాలు వ్యాపించాయి. గ్రామంలోని తాగునీరు కలుషితం కావడంతో ఈ విష జ్వరాలు వ్యాపించాయని ప్రజలు అంటున్నారు. తాగేందుకు నీళ్లు అందుటాబులో లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలు పాలవుతున్నారు.

Fevers in sachin tendulkar adopted village

గ్రామంలో విషజ్వారాలు ప్రబలి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈ విషాయన్ని సచిన్ టెండూల్కర్ దృష్టికి తీసుకెళ్తే తమ కస్టాలు గట్టెక్కుతాయని చెబుతున్నారు.

ఇటీవలే సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామానికి నికి జాతీయస్థాయిలో పురస్కారం లభించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారి కండ్రిగకు ఆదర్శ గ్రామం పురస్కారం లభించింది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో 'సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన'పై గురువారం నిర్వహించి సమావేశంలో కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ నుంచి నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ ఈ పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం పుట్టంరాజువారి కండ్రిగ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జేసీ అహ్మద్ ఈ సమావేశంలో వివరించారు. పుట్టంరాజువారి కండ్రిగ విదేశీ గ్రామాలను తలదన్నేలా తయారైంది. ఇంతలోనే ఇప్పుడు ఆ గ్రామంలో విషజ్వరాలు ప్రబలడం ఒకింత అశ్చర్యానికి గురి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+