విశాఖ నుంచి వెళ్లే, వచ్చే పలు రైళ్లు రద్దు

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: సింహాచలం నార్త్‌ రైల్వే స్టేషన్‌లో భద్రతాపరమైన మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను రద్దుచేశారు. డిసెంబర్ 6 నుంచి 12 వరకు విశాఖపట్నం- రాయగడ, 7 నుంచి 13 వరకు రాయగడ - విశాఖ ప్యాసింజర్‌ రైలు సేవలు రద్దుచేశారు.

అంతేగాక, డిసెంబర్ 6 నుంచి 13 వరకు విశాఖ పలాస, పలాస - విశాఖ ప్యాసింజర్‌, విశాఖ- గుణుపూర్‌ - విశాఖ ప్యాసింజర్‌ రైలు, విశాఖ - రాయ్‌పూర్‌ - విశాఖ ప్యాసింజర్‌ రైలు, ఈ నెల 7న విశాఖ - దిషూ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేశారు. ఈ నెల 8న దిషూ - విశాఖ రైలును, డిసెంబర్ 10న విశాఖ -టాటానగర్‌ వారాంతపు రైలును రద్దు చేశారు.

 few rails cancel from visakhapatnam

డిసెంబర్ 11న టాటానగర్‌ -విశాఖ వారాంతపు రైలు సేవలను రద్దుచేశారు. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖ - విజయనగరం ప్యాసింజర్‌, 10, 11 తేదీల్లో విజయనగరం - విశాఖ ప్యాసింజర్‌ రైలు సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెల 6 నుంచి 13 వరకు భువనేశ్వర్‌ - విశాఖ- భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, ఈ నెల 10న విశాఖ - పారదీప్‌ ఎక్స్‌ప్రెస్‌, 13న పారదీప్‌ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Railway officials said that few rails cancel from visakhapatnam railway station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి