IPL కామెంటేటర్ గా బాలయ్య.. దబిడి దిబిడే!!
సాంఘిక చిత్రాలతోపాటు పౌరాణిక, జానపద సినిమాలు చేస్తున్న కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. అటువంటి హీరో 'ఆహా'లో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో చేశారు. బాలయ్యలోని కొత్తకోణాన్ని ఈ షో ఆవిష్కరించింది. తాజాగా ఆయన క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడానికి కామెంటేటర్ అవబోతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిరోజు బాలకృష్ణ కామెంటరీ ఉండబోతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్వీట్ చేసింది. మార్చి 31వ తేదీన ప్రారంభమవబోతున్న ఐపీఎల్ తొలిరోజు కామెంట్రీ వేరే లెవల్ లో ఉండబోతోందనిట్వీట్ చేసింది.

అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే కార్యక్రమం ద్వారా ఈ తరం యువతకు చేరువయ్యారు. ఓటీటీలు ఎక్కువగా యువతే చూస్తుండటంతో వారిని టార్గెట్ గా పెట్టుకొని బాలయ్య చేసిన షో విజయవంతమైంది. అంతేకాకుండా బాలయ్య క్రేజ్ ఈ షోతో అమాంతం పెరిగింది. తాజాగా కామెంటేటర్ గా మారబోతున్నారు. క్రికెట్ అనేది మనదేశంలో ఒక మతం లాంటిది. ఐపీఎల్ ఎంత భారీ విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. తాజాగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ 31వ తేదీ నుంచి లైవ్ ఇవ్వబోతోంది. తొలిరోజు బాలకృష్ణ చేత కామెంట్రీ చెప్పించాలన్న ఐడియా అదిరిందంటున్నారు బాలయ్య అభిమానులు. ఇకనుంచి ఐపీఎల్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరే లెవల్ కు వెళ్లబోతోందని స్టార్ స్పోర్ట్స్ ప్రకటించింది.
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎
— StarSportsTelugu (@StarSportsTel) March 26, 2023
ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩
నందమూరి బాలకృష్ణ గారు😍
తెలుగుజాతి గర్వపడేలా 🔥
సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳
ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩
మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD#IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn pic.twitter.com/GpARnqMdgg












Click it and Unblock the Notifications