"ఓ పక్క భయం.., అయినా అడిగేశాను": పవన్ 'గుండు'పై పరిటాల అన్న మాటలివి?..

Recommended Video

    Pawan Kalyan Head Shave Issue : పరిటాల రవి అప్పట్లో ఏమన్నారంటే ?

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తన తాజా ప్రసంగాల్లో 'గుండు' ప్రస్తావన తీసుకురావడం పెద్ద చర్చనే లేవనెత్తింది. అటు మీడియా చానెళ్లలోను, ఇటు సోషల్ మీడియాలోనూ పెద్ద డిబేట్ జరిగింది.

    పవన్ అసలు ఆ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించకుండా ఉండాల్సింది అనేవారు కొందరైతే.., ఇప్పటికైనా దానికి ఫుల్ స్టాప్ పెట్టే పనిచేశారని మెచ్చుకుంటున్నవారు మరికొందరు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ 'గుండు' వ్యవహారంపై హాట్ హాట్ చర్చ సాగుతూనే ఉంది.

    ఈ నేపథ్యంలో సినీ రచయిత దివాకర్ మాడభూషి సైతం ఈ విషయంపై స్పందించారు. తన అనుభవంలోకి వచ్చిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

     అప్పట్లో:

    అప్పట్లో:

    'ఒక జ్ఞాపకం

    అనంతపురం... హైదరాబాద్..
    శ్రీ పరిటాల రవి... శ్రీ పవన్ కళ్యాణ్...' పేరిట దివాకర్ బాబు మాడభూషి సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

    అప్పట్లో పరిటాల రవి ఫిలిం నగర్ లోని ఆయన ఇంటికి పిలిపించి.. తనకో పాయింట్ చెప్పారని, దానిపై కథ చేయమన్నారని ఆ పోస్టులో పేర్కొన్నారు.

     కథ చేయమని పిలిస్తే:

    కథ చేయమని పిలిస్తే:

    శ్రీకృష్ణ దేవరాయలు, తెనాలి రామకృష్ణుడు ప్రస్తుత కాలం లోకి వస్తే జరిగే పరిణామాలు ఎలా వుంటాయి? అన్న పాయింట్ చెప్పి తననూ,ప్రముఖ కో డైరెక్టర్ శ్రీ కుర్రా రంగారావు గారిని కథ చేయమని పరిటాల కోరినట్లు తెలిపారు. ఆయన చెప్పిన పాయింట్ పై తాను కథ అల్లి మళ్లీ ఆయన్ను సంప్రదించినట్లు తెలిపారు.

     అనంతపురం రమ్మన్నారు:

    అనంతపురం రమ్మన్నారు:

    కథ రెడీ అయ్యాక అనంతపురం రమ్మని తనకు కబురుపెట్టారని దివాకర్ మాడభూషి పోస్టులో తెలిపారు. ఆయన చెప్పినట్లే తాము అక్కడికి వెళ్లామని, వెళ్లేసరికి ఆయన ఇంటికి మరమ్మత్తులు చేస్తుండటంతో తమను ఓ గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లారని అన్నారు. అక్కడ పరిటాల రవికి తాను కథ వివరించానని, కానీ అనుకున్న విధంగా రాలేదన్న కారణంతో మళ్లీ వర్క్ చేయమని పరిటాల చెప్పినట్లుగా వివరించారు.

    అలా అడిగేశా:

    అలా అడిగేశా:

    సినిమా కథ సంగతి పక్కనపెడితే.. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ గుండు వ్యవహారంపై బాగా ప్రచారం జరుగుతోందని, దానిపై పరిటాలను అడగడానికి తాను సాహసించినట్లు ఆ పోస్టులో తెలిపారు. ఒక ఆర్టిస్ట్ గురించి జనం అలా అనుకోవడం తనకు బాధ కలిగించిందని, అందుకే లోపల భయంగానే ఉన్నా.. పరిటాల గారిని అడిగేశానని గుర్తుచేసుకున్నారు.

    దానిపై స్పందించిన పరిటాల రవి.. 'అలాంటిదేమీ లేదండీ.. ఈ పుకారు ఎలా పుట్టిందో, ఎవరు పుట్టించారో కూడా అర్ధం కావడం లేదు' అన్నారట. పవన్ కళ్యాణ్ ఇటీవల గుండు గురించి ప్రస్తావించడంతో ఈ సంఘటన జ్ఞాపకం వచ్చిందని దివాకర్ మాడభూషి చెప్పుకొచ్చారు.

    కాగా, 'కొంటె కాపురం' సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన దివాకర్ మాడభూషి.. దాదాపు 100 సినిమాలకు కథలు అందించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+