భార్యపై కోపంతో ఆత్మహాత్యయత్నం, వైద్యులపై అలిగి వ్యైద్యానికి నిరాకరించిన ఆటోడ్రైవర్
గుంటూరు:భార్య భర్తల వివాదం చివరిక ప్రాణాల మీదికి తెచ్చింది. ఆసుపత్రికి వెళ్ళిన అతను అదే రీతిలో మెండితనాన్ని ప్రదర్శించాడు. తనకు వైద్యం చేసేందుకు వైద్యులు స్పందించలేదని అలకబూనాడు. వైద్యులు, పోలీసులు, కుటుంబసభ్యులు బతిమిలాడితే కాని, చికిత్స కోసం ఆ బాదితుడు సహాకరించాడు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రుకు చెందిన బేగ్ అమీర్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మద్య గొడవలు సాగుతున్నాయి.శనివారం నాడు వీరిమద్య గొడవలు తీవ్రమయ్యాయి.దీంతో ఆగ్రహంతో బేగ్ అమీర్ కిరోసిన్ పోసుకొని ఆత్మహాత్యయత్నానికి పాల్పడ్డాడు.

దీంతో బేగ్ అమీర్ భార్య, కుటుంబసభ్యులు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు.ప్రభుత్వాసుపత్రికి వచ్చిన నిమిషాల వరకు ఆసుపత్రి వైద్యులు పట్టించుకోలేదనే ఆవేదనతో బేగ్ అమీర్ క్యాజువాలిటీ సమీపంలోని ప్రహారీ గోడను ఎక్కాడు. తాను గోడ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకొంటానని బెదిరించాడు.
బేగ్ అమీర్ భార్య, కుటుంబసభ్యులు, రోగుల బందువులు, పోలీసులు, వైద్యులు వచ్చి ఆయనను బతిమాలాడారు. సుమారు 30 నిమిషాలపాటు ఆయన బతిమిలాడారు. విసిగి వేసారిన వైద్యులు సకాలంలో చికిత్స అందకపోతే చనిపోతావని హెచ్చరించారు. దీంతో బేగ్ అమీర్ కిందకు దిగాడు. 70 శాతం గాయాలతో ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications