దీక్ష: కెసిఆర్ చెంత చెప్పులేసుకున్నాడు (ఫోటో)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు చెప్పులు వేసుకోనంటూ దీక్ష చేపట్టిన తెలంగాణ వాది ఒకరు మంగళవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమక్షంలో దీక్ష విరమించి చెప్పులు వేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ నియోజక వర్గం కుబీర్ గ్రామానికి చెందిన ఫిరాజి తెలంగాణ వచ్చేంత వరకు చెప్పులు వేసుకోనని దీక్ష చేపట్టారు.
ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కొత్త తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని దీక్షను అదే విధంగా కొనసాగించారు. ముథోల్ శాసనసభ్యుడు విఠల్‌రెడ్డితో కలిసి ఫిరాజీ సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే దీక్ష విరమించి చెప్పులు వేసుకున్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఫిరాజీతో మంగళవారంనాడు దీక్ష విరమింపజేశారు. అతనికి కెసిఆర్ చెప్పులు తొడిగించారు. కెసిఆర్ సమక్షంలో దీక్ష విరమించడం మరుపురాని ఘటన అని ఫిరాజీ ఈ సందర్భంగా అన్నారు.












Click it and Unblock the Notifications