తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం...కీలక రికార్డులు దగ్థం...
గుంటూరు జిల్లా: రొంపిచర్ల మండల రెవిన్యూ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ తో సహా పలు ఫైళ్లు, కీలక రికార్డులు దగ్థం అయినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం సంభవించలేదు.

రొంపిచర్ల తహసీల్థార్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పలు కీలకమైన ఫైళ్లు దగ్ధం అయినట్లు ప్రచారం జరుగుతుండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఘటన జరిగిన సమాచారం తెలిసి కూడా అధికారులు వెంటనే కార్యాలయం వద్దకు రాకపోవడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం తో స్థానికుల్లో ఆందోళన చోటుచేసుకుంది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications