బాణాసంచా గోడౌన్ లో అగ్నిప్రమాదం: తప్పిన ప్రాణ నష్టం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన కాకాని జాతీయ రహదారి సమీపంలోని వినాయక ఫైర్ వర్క్స్ బాణాసంచా గోడౌన్ లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన కాకాని జాతీయ రహదారి సమీపంలోని వినాయక ఫైర్ వర్క్స్ బాణాసంచా గోడౌన్ లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి.
స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని.... మంటలార్పుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న డీఎస్పీ రామాంజనేయులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

అయితే గోడౌన్ తెరవక పోవడం తో ఈ ప్రమాదంలో ఎటు వంటి ప్రాణ నష్టం జరుగలేదని తెలుస్తోంది. అయితే రూ. 7 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని వెంకటేశ్వరావు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూ ట్ కారణం గానే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలపై భిన్న కధనాలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ పన్ను విధింపు నేపధ్యంలో నిర్వాహకులే బీమా కోసం దగ్ధం చేసారనే వాదనలు లేకపోలేదు. అగ్ని ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications