హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్‌లో మంటలు, ఆరా తీసిన చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎస్కార్ట్ వాహనంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ఈ మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం నిలిపేశాడు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం కోసం విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Fire accident in Home Minister Chinna Rajappa convoy

చినరాజప్ప ప్రయాణిస్తున్న కాన్వాయ్‌‌లోని జీపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. జీపు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికీ ఏమీ కాలేదు.

ఆకవరపాలెం సర్పానది వంతెన సమీపంలో ఇది చోటు చేసుకుంది. విషయం తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు.. చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Fire accident in Home Minister Chinna Rajappa's convoy in Vishakhapatnam district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి