శ్రీ కాళహస్తిశ్వర ఆలయం వద్ద అగ్ని ప్రమాదం, దగ్ధమైన యాగశాల
ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయ సమీపంలోని నూతన రాజగోపురం వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల రాజగోపురం వద్ద నిర్వహించిన యాగపూజలు జరిపేందుకు యాగశాలను ఏర్పాటు చేశారు.
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయ సమీపంలోని నూతన రాజగోపురం వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల రాజగోపురం వద్ద నిర్వహించిన యాగపూజలు జరిపేందుకు యాగశాలను ఏర్పాటు చేశారు.

రాజగోపుర మహాకుంభాభిషేక ఉత్సవాలు ముగిసినా యాగశాలను అలాగే వదిలేశారు. ప్రమాదవశాత్తూ నిప్పు అంటుకోవడంతో రాజగోపులం సమీపంలోని యాగశాల మొత్తం దగ్దమైంది.

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. అప్పటికే యాగశాలతో పాటు అందులో ఏర్పాటు చేసిన విగ్రహాలు కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఎవరికీ ప్రమాదం జరగలేదు.













Click it and Unblock the Notifications