తిరుమల బూందీ తయారీ పోటులో అగ్నిప్రమాదం, లడ్డూ తయారీ నిలిపివేత
అమరావతి: తిరుమల శ్రీవారి ఆలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న బూందీ తయారీ పోటులో అగ్ని ప్రమాదం సంభవించింది. పోటు కార్మికులు బూందీ తయారు చేస్తుండగా వంట గ్యాస్ పొయ్య నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీంతో బూందీ తయారీ పోటులో దట్టంగా పొగలు వ్యాపించాయి. ఈ పొగలను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. టీటీడీ అధికారుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గంట వ్వవధిలోనే మంటలను పూర్తిగా ఆపేసిన ఫైర్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ. 20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. తితిదే ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ప్రమాద స్థలిని పరిశీలించారు. అగ్నిప్రమాదం కారణం చేత తాత్కాలికంగా లడ్డూ తయారీ నిలిచిపోయింది.
ఓవర్ హీట్ కారణంగానే ప్రమాదం జరిగిందని టీటీడీ అధికారులు తెలిపారు. లడ్డూ తయారీ పునరుద్ధరణకు సత్వర చర్యల చేపట్టాలని టీటీడీ ఈవో సాంబశివరావు ఆదేశించారు.
Andhra: Fire break out near Venkateswara Temple in Tirumala (Tirupati), 3 fire tenders at spot. pic.twitter.com/7EGqkDeQhB
— ANI (@ANI_news) 10 June 2016
Andhra: Fire break out near Venkateswara Temple in Tirumala,Tirupati,3 fire tenders at spot, situation under control pic.twitter.com/7j9qsscpoR
— ANI (@ANI_news) 10 June 2016
Andhra: Fire breaks out near Venkateswara Temple in Tirumala (Tirupati, Chittoor), 3 fire tenders at spot. pic.twitter.com/K52tPWgYHw
— ANI (@ANI_news) 10 June 2016












Click it and Unblock the Notifications