హైద్రాబాద్‌లో జ్యోతిష్కుడిపై కాల్పులు, ప్రతీకారమా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని సరూర్ నగర్‌లో కాల్పుల కలకలం చెలరేగింది. నాగరాజు అనే జ్యోతిష్కుడి పైన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇద్దరు దుండగులు జింకల బావి వద్ద మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో జ్యోతిష్కుడు నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దుండగులు బైక్ పైన పరారయ్యారు.

రియల్ ఎస్టేట్, పాతకక్షలే కారణం

Firing on astrologer in Hyderabad

నాగరాజు పైన కాల్పులకు పాత కక్షలే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఏలూరు హైవై పైన పినకడిమి వద్ద జరిగిన ఓ హత్య కేసులో నాగరాజు నిందితుడిగా ఉన్నాడు. ఓ థియేటర్ యజమాని దుర్గారావు హత్య కేసులో పదిమంది నిందితులుగా ఉన్నారు.

వారిలో నాగరాజు ఒకరు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. కాగా, పాతకక్షలు, రియల్ ఎస్టేట్ మధ్య గొడవల కారణంగా ఈ గొడవల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు మృతి చెందారు. కాగా, నాగరాజు గత కొంతకాలంగా జ్యోతిష్కుడి పేరుతో అజ్ఞాతంలో ఉంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+