విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపి తొలి కేబినెట్ భేటీ: బాబు ప్రత్యేక పూజలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం గురువారం జరిగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు చర్చ కొనసాగింది.

గురువారం ఉదయం 11 గంటలకు ఏయూలోని సెనేట్ హాల్‌లో ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. సమావేశంలో రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. వృద్ధులు, వితంతు, వికలాంగుల ఫించన్ల పెంపు, ఎన్టీఆర్ సుజల పథకం, బెల్ట్‌షాపుల రద్దు, ఉద్యోగుల వయోపరిమితి 60 ఏళ్లకు పెంపు అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించినట్లు సమాచారం.

సమావేశంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, చినరాజప్ప, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి, కామినేని శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావులతోపాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు.

కేబినెట్ సమావేశానికి ముందు సింహాచలం అప్పన్న దేవాయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాద్రి శ్రీవరాహలక్ష్మి నరసింహస్వామిని గురువారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు, ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సింహాచలం ఉద్యోగులు చంద్రబాబుకు విరాళాలు అందజేశారు. ఆలయ ఉద్యోగులు రూ.3.09 లక్షలు, ఈవో రూ. 50 వేల విరాళాలు అందించారు.

తొలి కేబినెట్ భేటీ

తొలి కేబినెట్ భేటీ

విశాఖపట్నం నగరంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని సెనేట్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ సమావేశం గురువారం జరిగింది.

తొలి కేబినెట్ భేటీ

తొలి కేబినెట్ భేటీ

ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు నాలుగు గంటల పాటు చర్చ కొనసాగింది.

విశాఖ విమానాశ్రయంలో..

విశాఖ విమానాశ్రయంలో..

గురువారం ఉదయం 11 గంటలకు ఏయూలోని సెనేట్ హాల్‌లో ప్రారంభమైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది.

సింహాచలంలో..

సింహాచలంలో..

కేబినెట్ సమావేశానికి ముందు సింహాచలం అప్పన్న దేవాయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సింహాచలంలో..

సింహాచలంలో..

సింహాద్రి శ్రీవరాహలక్ష్మి నరసింహస్వామిని గురువారం ఉదయం చంద్రబాబు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.

సింహాచలంలో..

సింహాచలంలో..

సింహాచలం ఆలయ ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు, ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.

సింహాచలంలో..

సింహాచలంలో..

సింహాచలం అప్పన్న దేవాయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న ఆలయ అధికారులు, అర్చకులు.

సింహాచలంలో..

సింహాచలంలో..

ఈ సందర్భంగా రాజధాని నిర్మాణానికి సింహాచలం ఉద్యోగులు చంద్రబాబుకు విరాళాలు అందజేశారు. ఆలయ ఉద్యోగులు రూ.3.09 లక్షలు, ఈవో రూ. 50 వేల విరాళాలు అందించారు.

English summary
The first Cabinet meeting of Andhra Pradesh ministers, to be presided over by Chief Minister Nara Chandrababu Naidu, is being held in Visakhapatnam on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X