Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముందే చేతులెత్తేసిన చంద్రబాబు - 41 ఏళ్లల్లో తొలిసారి..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందే జరగనున్న రాజ్యసభ ఎన్నికలు సీఎం జగన్, చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. మూడు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఒక్కటైనా గెలుచుకోవాలని టీడీపీ భావించింది. వైసీపీ నుంచి ముగ్గురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేసారు. ఈ ఎన్నికల పైన చివరి నిమిషంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో, 41 ఏళ్లల్లో తొలి సారి రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోనుంది.

దూరంగా టీడీపీ : ఏపీలో రాజ్యసభ ఎన్నికల పైన కొద్ది రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్ పదవ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో ముగ్గురు సభ్యుల నియామకం కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం రాజ్యసభలో కనకమేడల ఒక్కరే టీడీపీ సభ్యుడిగా ఉన్నారు. ఆయన రిటైర్ అయితే టీడీపీ నుంచి ప్రాతినిధ్యం ఉండదు. దీంతో, కొద్ది నెలల క్రితం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్స ఎన్నికల్లో అనూహ్యంగా ఒక సీటు దక్కించకున్న టీడీపీ ఈ సారి ఎన్నికల్లోనూ అదే విధంగా ఒక సీటు గెలవాలని ప్రయత్నాలు చేసింది. దీని కోసం వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవాలని భావించింది.

First Time TDP to lose representation in Rajyasbaha, YCP will take Three Seats unanimously

వైసీపీ సభ్యుల ఏకగ్రీవం : ఒక్కో సభ్యుడు గెలవటానికి 44 మంది ఎమ్మెల్యే మద్దతు కావాలి. టీడీపీకి తమకు ఉన్న 18 మంది కాకుండా, మరో 26 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ దిశగా ప్రయత్నాలు చేసినా కావాల్సిన సంఖ్యలో సభ్యుల సమీకరణ సాధ్యం కాదని గుర్తించారు. దీంతో..రాజ్యసభ ఎన్నికలకు పోటీ చేయకూడదని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయంతో 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలి సారి పార్టీ రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతోంది. వైసీపీ నుంచి ముగ్గురు సభ్యులు ఇప్పటికే రాజ్యసభ అభ్యర్దులుగా నామినేషన్లు దాఖలు చేసారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాధరెడ్డి, గొల్లా బాబూరావు నామినేషన్లు వేసారు. ఇప్పుడు చంద్రబాబు తాజా నిర్ణయం తో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నక కావటం లాంఛనంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ నేతలతో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

First Time TDP to lose representation in Rajyasbaha, YCP will take Three Seats unanimously

చేరికల పై క్లారిటీ : రా కదలిరా, లోకేశ్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై నేతలకు సూచనలు చేసారు. వైసీపీ నుంచి ముఖ్యులు టచ్ లోకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వచ్చిన అందరినీ తీసుకోలేమని స్పష్టం చేసారు. అన్నీ ఆలోచించే నిర్ణయాలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదని అభిప్రాయపడ్డారు. కష్టపడిన నేతల భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడడానికే ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో అమిత్ షా తో భేటీ తరువాత దాదాపు వారం రోజులకు చంద్రబాబు ఉండవల్లి వచ్చారు. పొత్తులు, సీట్ల పైన బీజేపీ తో ప్రాధమికంగా చర్చలు జరిగాయి. బీజేపీ నుంచి పొత్తు పైన స్పష్టత వచ్చిన తరువాత ఉమ్మడి సీట్ల ప్రకటన..మేనిఫెస్టో వెల్లడించనున్నారు. ఈ రాత్రికి పవన్ కల్యాణ్ చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+