శుభవార్త: ఏపీకి తొలి వందే మెట్రో.. ఈ రూట్‌లోనే

దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతో రైల్వే వీటికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇటీవలే వందే మెట్రో రైలును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. గుజరాత్ లోని భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు ఇది ప్రయాణిస్తుంది. తక్కువ దూరం ఉండే నగరాల మధ్య దూరాన్ని వేగంగా అందుకునే ఉద్దేశంతో వందే మెట్రోను అందుబాటులోకి తెచ్చారు. దీనికి నమో భారత్ రైలు అనే పేరు పెట్టారు.

రెండువేల మంది ప్రయాణించొచ్చు
గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలులో కూర్చొని 1150 మంది, నిలబడి రెండువేల మంది ప్రయాణించవచ్చు. మెట్రో రైళ్లల్లో ఏ తరహా సౌకర్యాలుంటాయో వాటినే వీటిల్లో కూడా ఏర్పాటు చేశారు. లగేజీ పెట్టుకునేందుకు అల్యూమినియం ర్యాక్స్, ఆటోమాటిక్ తలుపులు, ఛార్జింగ్ సాకెట్లలాంటివి ఏర్పాటు చేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఏపీకి తొలి వందే మెట్రో రైలు రాబోతోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య ఇది పరుగులు తీయనుంది. దీనికిగల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.

first Vande Metro train in AP is coming between Srikakulam and Visakhapatnam

తిరుపతి, సికింద్రాబాద్ కు ప్రత్యేక సర్వీసులు కావాలి
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ డీఆర్ ఎం సమావేశంలో విశాఖపట్నంలో జరిగిన సందర్భంగా మంత్రి పాల్గొని ఉత్తరాంధ్రలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి రోజువారి పనులమీద ప్రతిరోజు విశాఖపట్నం వెళ్లేవారు ఎక్కువ అని, ఈ మార్గంలో వందే మెట్రోను ప్రారంభించించాలని అధికారులకు సూచించారు. అలాగే శ్రీకాకుళం నుంచి తిరుపతి, సికింద్రాబాద్ కు కూడా ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించాలని, రైల్వేలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అధికారులు కృషిచేయాలని మంత్రి కోరారు. వాల్తేరు డీఆర్ఎం డివిజన్ చైర్మన్ గా మంత్రి రామ్మోహన్ నాయుడును ఎన్నుకున్నారు. అన్ రిజర్వుడు ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ సిటీ రైళ్ల తరహాలో వందే మెట్రోలను భారతీయ రైల్వే తయారుచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+