ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు డప్పు కళాకారుల మృతి
చిత్తూరు: జిల్లాలోని పీలేరు మండలం తానా వడ్డిపల్లిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామంలో జరుగుతున్న నల్లగంగమ్మ జాతరకు వచ్చి తిరిగివెళ్తున్న డప్పు కళాకారులపైకి సిమెంటు లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇద్దరు కళాకారులు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను నారాయణ(43), జయరాం(44), బీరప్ప(72), వెంకటరావు(42), లక్ష్మణ్(68)గా గుర్తించారు. వీరంతా నిమ్మనిపల్లి మండలం కొండసానిపల్లికి చెందిన వారు.

ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతర తిలకించి రోడ్డుపై తిరిగి వెళ్తుండగా వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కళాకారులపై దూసుకెళ్లటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
డ్రైవర్ నిద్రమత్తు, బ్రేక్ ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications