గోదావరి నదిలోకి దూసుకెళ్లిన కారు: ఐదుగురు దుర్మరణం
కాకినాడ: యానం శివారులోని దరియాలతిప్ప వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండికా కారు గోదావరి నదిలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

ప్రమాదానికి గురైన కారు నంబరు ఏపీ 05వీ0201గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని తూరంగి డ్రైవర్ కాలనీకి చెందిన పొప్పాడి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులుగా గుర్తించారు.

కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని నదిలో పడిపోయింది. అయితే చీకటిగా ఉండడంతో ఆ ప్రమాదాన్ని వెంటనే ఎవరూ గుర్తించలేదు. శనివారం తెల్లవారు జామున కారు నీటిలో తేలుతుండడాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించరు.












Click it and Unblock the Notifications