తమిళనాడులో ఘోర ప్రమాదం: ఐదుగురు ఏపీ వాసుల మృతి, వీరే(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu
  Tamil Nadu Road Mishap, Telugu People lost Life ఏపీ వాసుల మృతి | Oneindia Telugu

  గుంటూరు: తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

  కన్యాకుమారికి వెళుతుండగా..

  కన్యాకుమారికి వెళుతుండగా..

  గుంటూరు నుంచి కన్యాకుమారికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను పొన్నూరు మండలం కొల్లూరు వాసులుగా గుర్తించారు.

  వేగంగా ఢీకొన్న సిమెంట్ లారీ

  వేగంగా ఢీకొన్న సిమెంట్ లారీ

  ఆగివున్న బస్సును వేగంగా వస్తున్న సిమెంట్‌ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
  క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌ తిరునెల్వేలి కలెక్టర్‌తో మాట్లాడారు.

  మృతులు వీరే..

  మృతులు వీరే..

  క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని.. మృతదేహాల తరలింపునకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోరారు. ఘటనాస్థలికి వెళ్లాలని కొల్లూరు తహసీల్దార్‌, ఎస్సైని ఆదేశించారు. మృతుల్లో దేసు వెంకటరామారావు(70), కన్నెగంటి రామయ్య(65), కంకిపాటి రత్నమాణిక్య(56), గొడవర్తి నాగవర్ధిని(43), సత్యం(40) ఉన్నారు.

  సీఎం దిగ్భ్రాంతి

  సీఎం దిగ్భ్రాంతి

  కాగా, ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం కార్యాలయం అధికారులు తమిళనాడు అధికారులను సంప్రదించి సహాయక చర్యలపై సమీక్షించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Five persons including three men and two women from Andhra Pradesh were killed and six others were injured in a road accident on Palayamkottai outskirts in the early hours of Saturday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X