చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో 5గురి ఆత్మహత్య
అనంతపురం/ప్రకాశం: జిల్లాలోని గుంతకల్లులోని హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం నెలకొంది. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు కుటుంబం, కుమార్తె, అల్లుడితో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటోంది.
మంగళవారం ఉదయం శ్రీనివాసులును రైల్వే స్టేషన్‌లో దించేందుకు కుమారుడు క్రాంతి కుమార్ గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అదే సమయంలో మనుమడు నవనీత్, మనుమరాలు యశశ్రీని గొంతునులుమి హతమార్చి, శ్రీనివాసులు భార్య జయలక్ష్మి, కుమార్తె రాజేశ్వరి, అల్లుడు బాబు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రియల్టర్ దారుణ హత్య
ప్రకాశం: ఒంగోలులో రియల్ ఎస్టేట్ వ్యాపారి యద్దనపూడి భ్రమరాచారి (39) సోమవారం స్థానిక లాయర్ పేట వద్ద గల సాయిబాబా గుడి సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. భ్రమరాచారి హత్యకు కారణం అతని స్నేహితుడు మేడపి విష్ణు , భ్రమరాచారికి మధ్య ఆర్థిక లావాదేవీలు, లేదా వివాహేతర సంబంధమే కారణం అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications