అయిదుగురు టీడీపీ సభ్యుల పై సస్పెన్షన్ - సమావేశాలు మొత్తంగా : స్పీకర్ పోడియం పైకెక్కి..!!
ఏపీ శాసనసభలో టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఈ బడ్జెట్ సమావేశాలకు మొత్తం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశ పెట్టింది. దీనికి సభకు ఆమోదం తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వరుస మరణాల పైన టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిని స్పీకర్ తిరస్కరించారు. దీంతో..టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముట్టడించారు. అక్రమ మద్యంతో వారు మరణించారంటూ నినాదాలు చేసారు. సీఎం రాజీనామా చేయాలని స్లోగన్స్ ఇచ్చారు. ఆ మరణాల పైన చర్చ జరగాలని పట్టు బట్టారు.

సభ ప్రారంభమైన సమయం నుంచీ
ఆ సమయంలో మంత్రి బుగ్గన ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని చెప్పకొచ్చారు. కానీ, టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి... ప్లకార్డులు చింపి స్పీకర్ పైన వేసారు. దీనిని స్పీకర్ సీరియస్ గా తీసుకున్నారు. సభను వాయిదా వేసారు. రెండో సారి సమావేశం అయిన తరువాత పరిస్థితిలో మార్పు రాలేదు. తిరిగి టీడీపీ సభ్యులు అదే తరహాలో ఆందోళన కొనసాగించారు. స్పీకర్ పోడియం చుట్టు ముట్టారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించారు. దీంతో..మంత్రులు కొడాలి నాని, కన్నబాబు, బొత్సా, సిదిరి అప్పలరాజు టీడీపీ తీరు పైన మండిపడ్డారు.

స్పీకర్ పైకి కాగితాలు.. మంత్రులు ఫైర్
ఎమ్మెల్యేలు రోజా..జోగి రమేష్ సైతం చంద్రబాబు హాయంలో మద్యం పాలసీ అమలు విధానం.. సభలో జరుగుతున్న పరిణమాల పైన టీడీపీ ని కార్నర్ చేసారు. సాధారణ మరణాలను తప్పు దోవ పట్టిస్తూ.. సీఎం ను రాజీనామా చేయమని డిమాండ్ చేయటం పైన మండిపడ్డారదు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేసారంటూ నాటి అంశాలను ప్రస్తావించారు. ఇక, మూడో సారి సభ సమావేశమైన తరువాత ప్రభుత్వం జంగారెడ్డి గూడెం ఘటన పైన ప్రకటనకు సిద్దంగా ఉందని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ ఆళ్లనాని ఆ ఘటన పైన ప్రకటన చదవటం ప్రారంభించారు.

అయిదుగురు సభ్యుల సస్పెన్షన్
ఈ ఘటన గురించి తెలియగానే అధికారులను అక్కడకు పంపామని చెప్పారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామని చెప్పకొచ్చారు. ప్రకటన చదువుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు మరోసారి పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేసారు. దీంతో..ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు...గోరంట్ల బుచ్చయ్య చౌదరి..పయ్యావుల కేశవ్.. బాలవీరాంజనేయ స్వామి.. నిమ్మల రామానాయుడును ఈ సమావేశాలకు మొత్తంగా సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానం చేసింది. ఎమ్మెల్యేలను వెంటనే సభ విడిచి బయటకు వెళ్లాలని స్పీకర్ వారిని ఆదేశించారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications