ఏపీలో ఏ వర్గానికి ఎన్ని ఓట్లు - ఎవరి మద్దతెవరికి, అక్కడే గెలుపు..!!

ఏపీలో ఈ సారి ఎన్నికల సమరంలో సామాజిక లెక్కలు కీలకం అవుతున్నాయి. సామాజిక లెక్కల ఆధారంగానే అభ్యర్దుల ఎంపిక నుంచి ఎలక్షనీరింగ్ వరకు పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసాయి. ప్రతీ నియోజకవర్గంలో ఈ లెక్కలే అభ్యర్దుల గెలుపు ఓటమలను డిసైడ్ చేయనున్నాయి. వర్గాల వారీగా పార్టీలు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ ఓట్ బ్యాంక్ పై లెక్కలు వేస్తున్నాయి. దీంతో, ఏ వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి..ఎవరి మద్దతు ఏ పార్టీకి ఉందనేది కీలకంగా మారుతోంది.

ఎవరి ఓట్లు ఎన్ని
ఏపీలో సామాజిక వర్గాల వారీగా పార్టీల వద్ద లెక్కల ఆధారంగా కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీలో కాపులు, బలిజలు: 52,07,091, ఎస్సీ మాల: 35,46,748, రెడ్డి: 31,69,029, మాదిగ: 15,85,725.,
యాదవ: 26,54,037, ముస్లిం: 23,84,492, కమ్మ: 29,87,911, ఉత్తరాంధ్ర కాపులు: 15,18,044. వైశ్యులు: 13,41,478, బోయ వాల్మీకి: 9,69,868, మత్స్య కారులు: 15,74,865, కొప్పుల వెలమ: 9,65,814, పద్మ శాలీలు:
9,24,351, గౌడ: 19,78,826, రజకులు: 8,41,457, బ్రాహ్మణ: 7,41,655, వడ్డెర్లు: 5,54,657, నాయీ బ్రాహ్మణులు: 4,15,520, క్షత్రియులు: 4,12,579, కలింగులు:3,57,070 ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో. పార్టీలు ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఉందో అక్కడ తమకు అనుకూలంగా పరిస్థితులు మార్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయి.

Behind the Ballot Unveiling voter-party connections in different caste and Communities

పార్టీలకు మద్దతు
దాదాపు అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గాల వారీ ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా పాజిటివ్ ఎన్ని.. నెగిటివ్ ఎన్ని.. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న వర్గాలు ఏమిటి.. ఆ వర్గం ఓట్ల శాతం ఎంత.. యువత ఓట్లు ఎన్ని ఉన్నాయి.. వారు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారనేదానిపై లెక్కులు తీస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్న సామాజిక వర్గాల జాబితాను సిద్ధం చేసి.. కుల పెద్దలను సంప్రదించి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. మయం తక్కువుగా ఉండటంతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలను రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నారు.

ఫలితంలో కీలకం
జగన్ 2019లో అధికారం చేపట్టిన సమయం నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఓన్ చేసుకొనే ప్రయత్నం చేసారు. బీసీ ఓటర్లు తొలి నుంచి టీడీపీకి అండగా ఉన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ఆ వర్గాలను తమ వైపు తిప్పుకోవటంతో పాటుగా నిలబెట్టుకొనే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరి కొన్నిసామాజిక వర్గాలు పూర్తిగా టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా నిలుస్తున్నాయి. వీరి ఓట్ బ్యాంక్ తో పాటుగా ఏపీ భవిష్యత్ నినాదంతో యువత ఓటింగ్ ను ఆకట్టుకొనేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే, గోదావరి జిల్లాల్లో మాత్రం ప్రతీ నియోజకవర్గంలో గెలుపు ఓటములను ఈ సామాజిక సమీకరణాలే నిర్ణయించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో, సామాజిక వర్గాల వారీగా పార్టీలు పెట్టుకున్న నమ్మకం ఎంత వరకు ఫలిస్తుందీ..ఎవరిని గెలిస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+