వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి ప్రజల నుంచి కీలక సమాచారం కోసం...జన్మభూమిలో కొత్త సర్వే....

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? వారి నుంచి మరింత కీలక సమాచారం సేకరించి తద్వారా వచ్చే ఎన్నికల్లో కొంతైనా లబ్ది పొందాలని ప్రయత్నిస్తుందా అంటే...అవుననే సమాధానం చెప్పక తప్పదు.

జన్మభూమిలో తాజాగా చేపట్టనున్నసర్వే నమూనా చూసినవారెవరికైనా ఈ విషయం వెంటనే అర్ధమైపోతుంది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా ప్రజలకు సంబంధించి అనేక వివరాలు సేకరించిన ఎపి ప్రభుత్వం తాజాగా జరగబోయే జన్మభూమి ద్వారా మరిన్ని వివరాలు రాబట్టనుంది.
ఇందుకోసం భిన్నమైన నమూనాలను కూడా సిద్ధం చేసి, గ్రామాలకు పంపిస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కీలక సమాచారాన్ని సేకరించి చేతిలో ఉంచుకోవడం ద్వారా ప్రజల అవసరాలు,అసంతృప్తులు అన్నీ తెలుస్తాయని, తద్వారా వారికి ఏమి చేయాలన్నది నిర్దేశించుకునేందుకు ఆస్కారం ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.

వివిధ కోణాల్లో...మరింత సమాచారం...

వివిధ కోణాల్లో...మరింత సమాచారం...

తాజాగా జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి కోసం సిద్ధం చేసిన నమూనాలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వం నుంచి లభించిన లబ్ధి వివరాలు, పెన్షన్లు, వైద్యం,విద్య, వ్యవసాయం వంటి అనేక విషయాల గురించి పలు కోణాల్లో వివరాలు సేకరించేందుకు ప్రశ్నలు పొందుపరచడం జరిగింది.

ఇప్పటికే కొంత సమాచారం...

ఇప్పటికే కొంత సమాచారం...

రాష్ట్ర విభజన తర్వాత ఎపిలో అనేక కోణాల్లో సర్వేలు నిర్వహిస్తూ వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం ఆ మధ్యకాలంలో ప్రజాసాధికార సర్వే ద్వారా సమగ్ర సమాచారం రాబట్టింది. ఆ సమాచారాన్ని అప్‌డేడ్‌ చేయాల్సిందిగా సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న జన్మభూమిలో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సర్వేలో పథకాల పంపిణీతో పాటు సర్వేకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయంగా కనిపిస్తోంది.

 ఎన్నికలే లక్ష్యంగా...

ఎన్నికలే లక్ష్యంగా...

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటం తో ఈ జన్మభూమి సర్వే ద్వారా తమకు అవసరమైన అన్ని కోణాల్లోనూ సమాచారాన్ని రాబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం రచించినట్లు తెలిసింది. ఈ సర్వేలో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, విశ్లేషించి ఎన్నికలను ఎదుర్కునేందుకు భవిష్యత్తు ప్రణాళికకు సిద్ధమవ్వాలనేది ఆయన ఆలోచనగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

సమగ్ర సమాచారం...

సమగ్ర సమాచారం...

మీ కుంటుంబంలో పింఛన్లకు లబ్ధిదారులు ఎందరున్నారు, ఇంకా ఎవరికి ఇవ్వాల్సి ఉటుందనే వివరాలు సేకరించనున్నారు. క్రిస్మస్‌, రంజాన్‌, సంక్రాంతి కానుకలు అందుకుంటున్న వారి వివరాలు తోపాటు మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం అందుకుంటున్న విద్యార్థులు, పిల్లల వివరాలు, గోరుముద్దలు, గిరి గోరుముద్దలు, అన్న అమృత హస్తం ఇలా వివిధ సంక్షేమ పధకాల లబ్ధికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించాలని నిర్ణయించారు.సంక్షేమ పధకాల లబ్ధితో పాటు రైతులకు సంబంధించి పంట, వాతావరణ భీమా, నేత కార్మికులకు అందుతున్న లబ్ధి వివరాలు, రైతులకు, ఎస్సీ, ఎస్టీలకు అందుతున్న ఉచిత విద్యుత్‌ సమాచారం వివరాలు కూడా సేకరించనున్నారు.

మరిన్ని వివరాల కోసం...

మరిన్ని వివరాల కోసం...

అలాగే ఎంతమంది వంట గ్యాస్‌ వినియోగిస్తున్నారన్న సమాచారంతోపాటు, కొత్త వ్యవసాయ కనెక్షన్లు, బోరు బావుల వినియోగం, ఇంతవరకు నిర్మించిన ఇళ్లు తదితర వివరాలు కూడా సేకరించనున్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా లబ్ది పొందిన వారి వివరాలు, ఉచిత వైద్య పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య, చిన్నారులకు ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ పంపిణీ, 108 సర్వీసులను ఉపయోగించుకున్న వారి సంఖ్య, తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వినియోగం వివరాలు కూడా ఈ జన్మభూమిలో సేకరించనున్నారు. విద్యారంగంలో ఎంతమంది స్కాలర్‌షిప్పులు ఉపయోగించుకుంటున్నారు, ఎందరిని అక్షరాస్యులుగా మార్చారు, పదో తరగతి విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ ఈ వివరాలు సైతం ఆరా తీయనున్నారు.

సమగ్ర, సమస్త సమాచారం...

సమగ్ర, సమస్త సమాచారం...

వివిధ సంక్షేమశాఖల ద్వారా అందించిన లబ్ధి ఇంకా ఎంతమందికి అందించాలన్న కోణంలో కూడా సమాచారాన్ని సేకరించేందుకు నమూనాలో ప్రశ్నలు పొందుపరిచారు. కేవలం లబ్దిదారుల వివరాలే కాకుండా సమాజ వికాసంలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సౌకర్యాలకు సంబంధించిన వివరాలు కూడా సేకరించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, వాటికి ఉన్న సొంత భవనాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలు, వ్యవసాయ రంగంలో ఎంతమందికి నీరు అందిస్తున్నారు, సాయిల్‌ హెల్త్‌ కార్డుల పంపిణీ వివరాలు, గ్రామాలకు ఉన్న రోడ్లు, ఫైబర్‌గ్రిడ్‌ కనెక్టివిటీ పైనా ఆరా తీయనున్నారు.

అంతిమంగా లాభమే...

అంతిమంగా లాభమే...

ఇంతవరకు ప్రభుత్వాలు ఎన్ని సర్వేలు చేపట్టినా అవి మూస పద్దతిలో, సాంప్రదాయ పద్దతిలో సాగేవి. అయితే కాలక్రమంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కిన నేపథ్యంలో, గ్రామాల్లో సైతం డిజిటల్ రివల్యూషన్ ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో అసలే హైటెక్ ముఖ్యమంత్రిగా పేరున్న చంద్రబాబు సమాచార విప్లవాన్ని సాంకేతిక విప్లవంతో మేళవించి సానుకూల ఫలితాలు రాబట్టేందుకు సంసిద్దులయ్యారు. వారికి కొరతగా ఉన్న వాటిని అందించి తద్వారా ప్రజల్లో సంతృప్త స్థాయిలను పెంచి వారిని ఓటు బ్యాంకుగా మల్చుకోవాలనేది ఆయన ఆకాంక్షగా తెలుస్తోంది. ఈ ప్రణాళిక విజయవంతమై దీనివల్ల అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు లభ్ది చేకూరితే దీన్నేఉభయతారకమంత్రంగా అభివర్ణించుకోవచ్చు.

English summary
Is the government trying to get more details regarding the people of Andhra Pradesh? More key information from them will get some benefit in the next election? anyone can say yes after seeing the new model of upcoming JANMABHOOMI survey sample. Already through various surveys the AP Government, which has collected many details about the people, eventhough it will get more details through the upcoming janmabhoomi programme. Prepared different samples for this and send it to the villages. The election is coming near, By collecting and retaining information, people needs and what they want that matters known by the Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X