మార్చి 1నుండి చంద్రబాబు సర్కార్ పై ప్రజా ఉద్యమం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి నేతలు సీఎం చంద్రబాబుకు అల్టిమేటం జారీ చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని ముఖ్యంగా రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టును నిలిపివేసి తను పుట్టిన ప్రాంతానికి చంద్రబాబు తీవ్రద్రోహం చేస్తున్నారని వైసిపినేతలు మండిపడ్డారు. సీమ ప్రయోజనాలను గాలికి వదిలేసి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీలకతీతంగా చంద్రబాబుపై ఉద్యమం

జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను చంద్రబాబు నిలిపివేసినట్టు వారు ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించాలని, ఒకవేళ అలా చేయకపోతే మార్చి ఒకటవ తేదీన పార్టీలకతీతంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని హెచ్చరించారు.

for Rayalaseema lift irrigation project works ysrcp fight against Chandrababu government from March 1st

చంద్రబాబు హయాంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై అడుగు పడలేదు

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి చంద్రబాబు తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైయస్సార్ రాయలసీమ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించాలని ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని చూశారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దీని పైన ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు.

రేవంత్ అలా చెప్తున్నా చంద్రబాబు స్పందించకపోవటం దారుణం

ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కొనసాగాలని, మళ్లీ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్లీ ప్రాజెక్టు పనులు మూలన పడ్డాయని అన్నారు. చంద్రబాబుతో తనకున్న సన్నిహిత్యంతో రాయలసీమ లిఫ్ట్ ఆపానని రేవంత్ రెడ్డి చెప్పుకున్నా చంద్రబాబు దీనిపైన స్పందించలేదని ఆయన అన్నారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయాలని ఉద్యమం మొదలుపెట్టామని అన్నారు.

మార్చి 1 నుండి చంద్రబాబుపై యుద్ధం

ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకువెళ్లి పెద్ద ప్రజా ఉద్యమంగా ముందుకు వెళతామని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మార్చి 1న రాయలసీమ లిఫ్ట్ పై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబు దుర్మార్గ చర్యలను అడ్డుకునేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యచరణ చేపడుతుందని, రేవంత్ రెడ్డితో కుమ్మక్కై చంద్రబాబు నీటి దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోతే మార్చి ఒకటి నుంచి చంద్రబాబు పై యుద్ధం జరుగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+