Chandra Babu: శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రూ.4,400 కోట్లు విడుదల..
ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ.4,400 కోట్ల నిధులను శనివారం విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యకార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాలో కలెక్టర్లతో సీఎస్ నీరభ్ కుమార్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు చెప్పారు.జూలై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్లు పెన్షన్ల పంపిణీని గంట గంటకూ పర్యవేక్షించాలని కోరారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఇటీవల జరిగి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు కూటమి పెన్షర్లలకు హామీ ఇచ్చింది. పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది.

ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేయనున్నారు. అంటే ఏప్రిల్, మే, జూన్ సంబంధించి రూ.3 వేలు, జులైకి సంబంధించి రూ.4 వేలు మొత్తం రూ.7 వేలు పెన్షనర్లకు అందివ్వనున్నారు.వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. పెంచిన పెన్షన్లు పంపిణీ ప్రక్రియలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాకలో స్వయంగా లబ్ధిదారులకు చంద్రబాబు పెన్షన్ డబ్బులు ఇస్తారు.












Click it and Unblock the Notifications