AP Results: ఏపీలో టీడీపీకి ఎన్ని సీట్లంటే? మాజీ మంత్రి జోస్యం..!

ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఫలితాలపైనే నెలకొంది. ముఖ్యంగా ఈసారి ఎన్నికల్లో భారీ ఎత్తున జరిగిన పోలింగ్ అన్ని పార్టీల్లోనూ ఆశలు రేపుతోంది. అధికార వైసీపీతో పాటు విపక్ష కూటమి కూడా తమదే గెలుుపని పక్కాగా చెప్తున్నాయి. అదీ ఏ స్ధాయిలో ఉందంటే ఓటేసిన సాధారణ ఓటరు కూడా ఆశ్చర్య పోయే స్ధాయిలో వీరి అంచనాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు ఫలితాలపై తనదైన రీతిలో జోస్యం చెప్పారు.

రాష్ట్రంలో ఈసారి జరిగిన ఎన్నికలు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్యనే అని నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.ఐదేళ్ల అరాచకాన్ని పారదోలేందుకు ప్రజలు కట్టలు తెంచుకును వచ్చి ఓట్లు వేశారన్నారు. దాన్ని తట్టుకోలేక వైసీపీ నేతలు ఫ్రస్టేషన్ లో దాడులకు తెగబడుతున్నారన్నారు. జగన్ రెడ్డి షాడో ఛానల్ తప్పుడు కథనాలను ప్రసారం చేస్తుందన్నారు.

former ap minister somireddy chandramohan reddy predicts tdp will win 135 seats

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వైసీపీ 100 సీట్లలో గెలుస్తుందని ఊకదంపుడు ప్రసారాలు చేసుకుంటుందని సోమిరెడ్డి ఆరోపించారు. దుర్మార్గంగా దాడులు జరుగుతున్నా సాక్షి తప్పుడు కథనాలు ప్రసారం చేయడం సిగ్గుచేటన్నారు. ఎలక్షన్ కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని పిలిచి మందలించిన చరిత్ర ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు. రాష్ట్ర భవిష్యత్ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుతో ఓటర్లకు తెలుసు అందుకే వ్యయాన్ని లెక్కచేయకుండా దూర ప్రాంతాల నుండి వచ్చి ఓట్లు వేశారన్నారు.. దీన్ని జీర్ణించుకోలని వైసీపీ నేతలు దగ్గర ఉండి దాడులు చేయిస్తున్నారన్నారు.

టీడీపీ అధికారంలోకి రావడం పక్కా అని, 135 సీట్లతో టీడీపీ గెలవబోతుందని సోమిరెడ్డి తెలిపారు. కడపలో కూడా వైసీపీ ఓడిపోబోతుందన్నారు. కడప పార్లమెంట్ లో టీడీపీకి మెజార్టీ సీట్లు వస్తాయన్నారు. ఉమ్మడి నెల్లూరులో టీడీపీ 10 సీట్లలో గెలువబోతుందని, దుర్మార్గుల నుండి రాష్ట్రాన్ని కాపాడటానికి టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టేందుకు భారీగా ఓట్లు వేశారన్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు దొంగసర్వేలు వైసీపీకి అనుకూలంగా చెప్పాయని, ఎలక్షన్ కోడ్ వచ్చాక అసలైన సర్వేలు వచ్చాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+